మాజీ ఎమ్మెల్యే తలారికి జగ్గిరెడ్డి పరామర్శ | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే తలారికి జగ్గిరెడ్డి పరామర్శ

Aug 19 2026 12:12 AM | Updated on Aug 19 2026 12:12 AM

రాజమహేంద్రవరం సిటీ: ప్రమాదవశాత్తూ గాయాపడి దివాన్‌చెరువులోని విజయభారతి చెస్ట్‌ ఇన్‌స్టిట్యూ ట్‌లో చికిత్స పొందుతున్న గోపాలపురం మాజీ ఎమ్మె ల్యే, వైఎస్సార్‌ సీపీ కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తలారి వెంకట్రావును ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, నాయకులు బీవీఆర్‌ చౌదరి తదితరులు మంగళవారం పరామర్శించారు. తలారి ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

కొనసాగుతున్న జూడాల నిరసన

కాకినాడ క్రైం: జూనియర్‌ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని నాయకులు డిమాండ్‌ చేశారు. రంగరాయ వైద్య కళాశాల జూనియర్‌ డాక్టర్ల ఆందోళన మంగళవారం ఏడో రోజుకు చేరింది. జీజీహెచ్‌ ఎదుట ఉన్న పీజీ వసతి గృహ ఆవరణలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సుమారు 700 మందికి పైగా హౌస్‌ సర్జన్లు, పీజీలు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement