అయినవిల్లి: విఘ్నాలను తొలగించే అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారు జామునే స్వామివారికి మేలుకొలుపు సేవ తదితర పూజలు చేశారు. 41 మంది లఘున్యాస అభిషేకాలు, ముగ్గురు భక్తులు స్వామికి ఉండాళ్ల పూజ, 24 మంది శ్రీలక్ష్మీగణపతి హోమం, ఇద్దరు చిన్నారులకు అన్నప్రశన, ఐదుగురికి తులాభారం, ఏడుగురికి అక్షరాభ్యాసం నిర్వహించారు. 40 మంది నూతన వాహన పూజలు చేయించుకున్నారు. 2,352 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయానికి ఈ ఒక్కరోజు రూ.3,92,731 ఆదాయం సమకూరిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.


