హామీ: చెయ్యేరు గ్రామంలో రూ.8 కోట్లతో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం
ప్రస్తుత పరిస్థితి: కొన్ని రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం జరిగాయి. కానీ చెప్పినట్టుగా మొత్తం గ్రామంలో రూ.8 కోట్లతో పనులు మాత్రం జరగలేదు. ఎప్పటికి పూర్తి చేస్తారో తెలియడం లేదు. దీని పై అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు.
పర్యటన: ముమ్మిడివరం నియోజకవర్గం (2025 మే 31న పి–4 కార్యక్రమంలో భాగంగా)
హామీ: కాట్రేనికోన మండలం చెయ్యేరులో చెరువు ఆధునీకరణ
ప్రస్తుత పరిస్థితి: చెయ్యేరులో చెరువును నిల్వ ట్యాంకుగా ఆధునీకరించి తాగునీటి ప్రాజెక్టుగా నిర్మిస్తామని రూ.17 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. హామీ ఇచ్చి ఏడాది దాటినా కార్యరూపం దాల్చలేదు. టెండర్ల ప్రక్రియలోనే నిలిచిపోయింది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు.


