అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ జరిపారు. స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 40 మంది, లక్ష్మీగణపతి హోమంలో 16 మంది పాల్గొన్నారు. పంచామృతాభిషేకాలు ఒక జంట, ఉండాళ్ల పూజ ఏడుగురు దంపతులు చేశారు. ముగ్గురు చిన్నారులకు నామకరణ, ఐదుగురికి అక్షరాభ్యాసాలు జరిపారు. 8 మంది చిన్నారులకు తులాభారం, ఏడుగురు చిన్నారులకు అన్నప్రాశన, 39 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 2,469 మంది అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్కరోజు ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,09,594 ఆదాయం వచ్చిందని ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.


