రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర పాలన | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర పాలన

Feb 2 2026 7:53 AM | Updated on Feb 2 2026 7:53 AM

రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర పాలన

రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర పాలన

మాజీ మంత్రి అంబటిపై దాడి

తీవ్రమైన చర్య

మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు

మామిడికుదురు: రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా రెడ్‌బుక్‌ పాలన సాగుతోందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం స్థానిక మీడియా సమావేశంలో ఆయన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దేశంలో ఎక్కడా లేని పాలన మన రాష్ట్రంలోనే జరుగుతోందన్నారు. నాలుగు సార్లు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు పాలన ఇదేనా అని ప్రశ్నించారు. కూటమి అధికారం చేపట్టిన రోజు నుంచి రాష్ట్రంలో అధికార పార్టీ ఆగడాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాపు నేతలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య, మండల శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి భగవాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గట్టిగా ప్రశ్నించే వారిని భయబ్రాంతులకు గురి చేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గమనించాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పాటి శివకుమార్‌, సోషల్‌ మీడియా కార్యదర్శి నేతల నాని, పార్టీ నేతలు ఎండీవై షరీఫ్‌, కొల్లాబత్తుల మున్నా, కంచి శ్రీరామ్‌, భూపతి మహేంద్ర, ఉచ్చుల మోహన్‌, గుర్రం జాషువా, అడబాల జానకీరామ్‌, భూపతి బాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement