ప్రజాస్వామికమా!
ప్రశ్నించిన వారిపై దాడులు
మాజీ మంత్రి అంబటిపై దాడి హేయమైన చర్య
అల్లవరం: ఏపీలో ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేలా, అధికార ఆహంకారానికి పరాకాష్టగా టీడీపీ శ్రేణులు వ్యవహరిస్తున్నారని, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడే దీనికి నిదర్శనంగా నిలుస్తుందని మాజీ ఎంపీ, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా అనురాధ ఖండించారు. ఇది ఒక నాయుకుడిపై జరిగిన దాడి కాదని, ప్రతిపక్షాల గొంతుని అణచివేయాలని రాజకీయ దురుద్దేశంతో టీడీపీ చేస్తున్న అరాచకమని ఆదివారం ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంబటి ఇంటి వద్దకు వెళ్లి ఆస్తులను ధ్వంసం చేసి, క్షమాపణలు చెప్పాలని బెదిరించడం టీడీపీ హింసకు సాక్ష్యమని తెలిపారు. చంద్రబాబుపాలనలో ప్రజాస్వామ్యం పూర్తిగా లోపించిందని, రాంబాబుపై దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ప్రేక్షక పాత్ర వహించడంలో రాజకీయ కక్ష దాగి ఉందన్నారు. దాడికి బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఎంత మందిని అరెస్టు చేశారో చెప్పాలని అనురాధ డిమాండ్ చేశారు. ఒక వేళ అరెస్టు చేయకపోతే టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు చట్టం వర్తించదా అని ప్రశ్నించారు. ఏపీలో టీడీపీ శ్రేణులు చేస్తున్న అరాచకాలను ప్రజల గమనించాలని ఆమె కోరారు. వైఎస్సార్ సీపీ హింసను ఎప్పుడు ప్రోత్సహించదని, కానీ దాడులు, అరాచకాలు, రాజకీయ ప్రతికార చర్యలను ఎప్పుడు సహించబోమని ఆమె హెచ్చరించారు.
రావులపాలెం: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గుండాలు, కార్యకర్తలు దాడి చేయడం హేయమైన చర్య అని, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. మాజీ మంత్రి అంబటిపై దాడిని నిరసిస్తూ జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెంలో ఆదివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైఎస్సార్ సీపీ క్యాంప్ కార్యాలయం నుంచి అమలాపురం రోడ్డు మీదుగా కోనసీమ ముఖ ద్వారం వరకు సాగిన ర్యాలీలో చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జగ్గిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తే సమాధానం చెప్పలేక చంద్రబాబు తన గుండాలతో దాడులు చేయిస్తున్నారన్నారు. అంబటిపై టీడీపీ గుండాలు, కార్యకర్తలు దాడి చేయడం అప్రజాస్వామికం అన్నారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సొంత వారికి విశాఖ భూములు దోచిపెడతారా?
విశాఖలోని గీతం యాజమాని, లోకేష్ తోడల్లుడికి 54 ఎకరాల ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేయడం ప్రభుత్వ సొమ్మును దోచుకోవడం కాదా అని ప్రశ్నించారు. నాడు జగన్‌మోహన్‌రెడ్డి రూ.300 కోట్లతో విశాఖలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే నానా గోల చేసిన చంద్రబాబు, ఇప్పుడు రూ.వేల కోట్లు విలువైన 54 ఎకరాలను ఆ సంస్థకు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో ఎకరం భూమి పాట పెడితే రూ.130 కోట్లు వస్తుందని అటువంటిది ఇక్కడ 54 ఎకరాలను ఫ్రీగా ఎలా ఇస్తున్నారో చంద్రబాబు చెప్పాలన్నారు. వీటన్నింటి నుంచి ప్రజల ఆలోచనలను మళ్లించేందుకే అంబటిపై దాడి అని పేర్కొన్నారు. ఈ ఘటనలో దోషులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే డీజీపీని అడుగుతున్నామన్నారు.
గతంలో కాపు నేత వంగవీటి మోహనరంగాను ఇదే టీడీపీ ప్రభుత్వం హత్య చేసిందన్నారు. అలాగే ముద్రగడ పద్మనాభంపైనా కేసులు పెట్టి హతమార్చేందుకు కుట్రలు పన్నారని, నేడు రాంబాబు పైనా హత్యాయత్నానికి పాల్పడ్డారని ఈ చర్యలను వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కుందూరులో ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని టీడీపీ గుండాలు కారుతో గుద్ది చంపినా, పోలీసు వ్యవస్థ మొద్దు నిద్ర పోతోందన్నారు. పవన్‌కల్యాణ్ ఏమైపోయారన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే వైఎస్సార్ సీపీ తరఫున తాము ప్రశ్నిస్తామని, అవసరమైతే పోరాటానికి కూడా వెనుకాడమన్నారు. కార్యక్రమంలో రావులపాలెం జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు, కొత్తపేట ఎంపీపీ మార్గాన గంగాధరరావు, మండల కన్వీనర్లు బొక్కా కరుణాకరం, తమ్మన శ్రీను, పార్టీ మండల కార్యదర్శి పులగుర్త రామారావు, గోపాలపురం సర్పంచ్ సబ్బితి మోహనరావు, రావులపాలెం ఉపసర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు కప్పల నాగేశ్వరరావు, తోరాటి లక్ష్మణరావు, చల్లా ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
అంబటిపై దాడి హింసా రాజకీయాలకు నిదర్శనం
జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి దాడికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన రావులపాలెంలో నిరసన ర్యాలీ
డైవర్షన్ పాలిటిక్స్
తిరుమల లడ్డూపై అసత్య ప్రచారాలు చేసి లడ్డులో పంది కొవ్వు, చేప నూనె కలిసిందంటూ తిరుమల ఖ్యాతిని దెబ్బతీసిన చంద్రబాబుకు అటువంటిదేమీ లేదని సిట్ తేల్చడంతో ఆయన డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించారన్నారు.
ప్రజాస్వామికమా!
ప్రజాస్వామికమా!


