●రైతుల ఆదాయం పెరగదు | - | Sakshi
Sakshi News home page

●రైతుల ఆదాయం పెరగదు

Feb 2 2026 7:53 AM | Updated on Feb 2 2026 7:53 AM

●రైతు

●రైతుల ఆదాయం పెరగదు

రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం 11 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా అదే ప్రకటన చేస్తోంది. కాని ఇంత వరకు ఆ హామీ నెరవేరలేదు. రైతులకు ప్రయోజనం చేకూర్చే యాంత్రీకరణ, ఉత్పత్తులు నిల్వ చేసుకునే గిడ్డంగులు, శీతల గిడ్డంగులకు రాయితీలు ప్రకటించలేదు. పీఎం కిసాన్‌ సన్మాన్‌ నిధికి ఇచ్చే సొమ్ములను కూడా పెంచలేదు. జిల్లాలో క్రమం తప్పకుండా సాగు జరిగే వరి, ఇతర వ్యవసాయ పంటలకు, అరటి, కూరగాయ పంటలకు ఈ బడ్జెట్‌ వల్ల మేలు కలగదు. వ్యవసాయానికి పలు రాయితీలు ఇస్తున్నామని ప్రతి బడ్జెట్‌లో చెప్పుకొస్తున్నారు. కాని వాటిని అమలు చేయడం లేదు. ఉదాహరణకు సహకార రంగంలో బహుళార్థక సేవా సంఘాలకు నాలుగు శాతం వడ్డీతో నిధులు ఇస్తామని ప్రకటించినా అమలు కావడం లేదు.

– జిన్నూరి రామారావు (బాబి),

వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు.

●రైతుల ఆదాయం పెరగదు 
1
1/1

●రైతుల ఆదాయం పెరగదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement