నగమోము సింగారం
ఫ ఇమిటేషన్ జ్యూయలరీకి పెరిగిన ఆదరణ
ఫ అందుబాటులో వివిధ రకాల ఆభరణాలు
ఫ తక్కువ ధరలో
లభించడంతో మహిళల ఆసక్తి
ఫ శుభకార్యాలు, వేడుకల్లో వినియోగం
రాయవరం: రోజు రోజుకూ బంగారం ధర కొండెక్కుతోంది. ప్రస్తుతం పది గ్రాములు రూ. రెండు లక్షలకు చేరువలో ఉంది. బంగారం, వెండి ధరలకు కళ్లెం లేకుంది. అయితే ఏ శుభకార్యమైనా మెడలో బంగారు నగలు ధరించాలని మహిళలకు ఉత్సుకత ఉంటుంది. ప్రస్తుతం సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి నెలకొంది. అందుకే.. అచ్చు బంగారం నగలను పోలిన జ్యూయలరీ ట్రెండ్ నడుస్తోంది. అలంకారం కోసమే కాకుండా పలు శుభ కార్యక్రమాల్లో సైతం ధరించేందుకు బంగారాన్ని మైమరపించేలా ఈ జ్యూయలరీ లభిస్తుండడంతో మహిళలు వీటినే కోరుకుంటున్నారు. చూస్తే నిజంగా బంగారు ఆభరణాలనే విధంగా ఆకట్టుకునే డిజైన్లలో మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ నగలకు ఒక గ్రాము బంగారం అద్దడంతో నిజమైన పుత్తడిలా కనిపిస్తుంటుంది. పుత్తడితో పోల్చి చేసే నగలు బంగారం పూత పూసి స్వర్ణకాంతులతో శోభను సంతరించుకుంటున్నాయి. పాలు, నీళ్లకు మధ్య తేడాను హంసలు ఇట్టే కనిపెడతాయనేది నానుడి. అదే తరహాలో బంగారు నగలకు, గిల్టు నగల మధ్య తేడా కేవలం మహిళలకే తెలుస్తుంది. వివిధ రకాల లోహాలతో కూడిన పదునైన ఫినిషింగ్‌తో ఇమిటేషన్ నగలు దొరుకుతున్నాయి. కొత్త ఫ్యాషన్లు, సరికొత్త నగలను కోరుకునే వారికి బీరువాలో నిజమైన ఆభరణాలు ఉన్నప్పటికీ ముస్తాబు కోసం బంగారాన్ని మరిపించే వివిధ లోహాల జ్యూయలరీని మహిళలు ఎంచుకుంటున్నారు.
పసిడి పరుగులు
పసిడి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. 2025 ఆగస్టులో పది గ్రాముల బంగారం ధర రూ.1,02,650 ఉండగా, సెప్టెంబర్‌లో రూ.1,14,500, అక్టోబర్‌లో రూ.1.28 లక్షలు, నవంబర్‌లో రూ.1,29,100, డిసెంబర్‌లోరూ.1,39,600లు, 2026 జనవరిలో ఏకంగా రూ.1.49 లక్షలకు చేరింది. ఈ ధర ఈ ఏడాది రూ.రెండు లక్షలకు చేరుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధర కూడా అంతే వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2.39 లక్షలకు చేరింది. బంగారం, వెండి వాటి రికార్డులను అవే తిరిగి రాస్తున్నాయి.
ధగధగ మెరుపులు
బంగారు ఆభరణాలతో సమానంగా ఇమిటేషన్ నగలు ధగధగ మెరుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మార్కెట్లో ఇమిటేషన్ జ్యూయలరీ కొత్త డిజైన్లలో వస్తున్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, తుని పట్టణాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా కొత్తగా ఇమిటేషన్ నగల దుకాణాలు ప్రారంభించారు. అక్కడ మహిళలకు నచ్చిన కొత్త డిజైన్లు అందుబాటులో ఉంటున్నాయి. వేసుకునే డ్రెస్‌లు, చీరలను బట్టి మ్యాచింగ్ డిజైన్లు దొరుకుతుండడంతో మహిళలు ఎక్కువగా వీటినే కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో బంగారు నగల షాపులతో పోటీగా వివిధ కంపెనీల పేరుతో ఇమిటేషన్ నగల దుకాణాలు వెలుస్తున్నాయి. బంగారం షాపులే అన్నట్లుగా ఉంటున్న ఈ షాపులు కూడా ఇటీవల కాలంలో రద్దీగా మారుతున్నాయి.
● గుర్తు పట్టలేనంతగా..
ఇమిటేషన్ నగలు బంగారు నగలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటున్నాయి. బర్త్ డే ఫంక్షన్ నుంచి పెళ్లిళ్ల వరకూ ఈ నగలనే వేసుకుంటున్నాం. బంగారు నగలు ఉన్నప్పటికీ ఇమిటేషన్ నగలకే ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇవి వివిధ రకాల కొత్త డిజైన్లలో ఉంటున్నాయి.
–బీఎస్ సునీతాలక్ష్మి, ఉపాధ్యాయిని,
ద్రాక్షారామ
● అందరికీ అందుబాటులో..
పేద, మధ్య తరగతి ప్రజలకు సైతం అందుబాటులో ఇమిటేషన్ నగలు దొరుకుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధర రోజు రోజుకూ పెరుగుతున్న తరుణంలో ఇమిటేషన్ నగలకు ప్రాధాన్యం పెరుగుతుంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ నగలు ఒక కానుక అని చెప్పవచ్చు. ఎక్కడైనా పోగొట్టుకున్నా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు.
–జి.త్రివేణిస్వాతి, గృహిణి, కాకినాడ
బంగారు పూతతో సరికొత్తగా..
బంగారం, వెండి పూతతో తళుకు తళుకుమంటూ మెరుస్తు న్న నగలను చూసి అ బ్బుర పడాల్సిందే. ఈ మెరుపులు కొన్ని నెల ల పాటు తాత్కాలిక మే అయినప్పటికీ రకరకాల డిజైన్లతో నగలు ఉండ డంతో అన్ని వర్గాల మహిళలు ఎక్కువగా కొను గోలు చేస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్, వైబ్‌సైట్ల ద్వా రా ఇమిటేషన్ నగలను అధికంగా కొంటున్నారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో ఈ దుకాణాలు ఏర్పాటయ్యాయి.
నగమోము సింగారం
నగమోము సింగారం
నగమోము సింగారం
నగమోము సింగారం
నగమోము సింగారం


