
యూరియా బ్లాక్ మార్కెట్‌పై ఉద్యమిద్దాం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
● 9న ఆర్డీఓ కార్యాలయాల
వద్ద నిరసనకు పిలుపు
అమలాపురం రూరల్: జిల్లాలో రైతులకు యూరియా అందించకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలించడాన్ని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల వద్ద వైఎస్సార్ సీపీ అధ్వర్యంలో ఉద్యమం చేయనున్నట్టు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. అమలాపురం మండలం భట్నవిల్లిలో పార్టీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి పినిపే విశ్వరూప్ నివాసంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యూరియాకు ప్రభుత్వం కృతిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తోందన్నారు. యూరియా పేరుతో ప్రతిపక్ష పార్టీలు, రైతులు ధర్నా చేస్తే జైల్లో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వాటిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని సీఎం ప్రకటిస్తే దానిని రైతులకు అందకుండా బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. రైతులకు వ్యాపారులు అధిక ధరలకు యూరియా అమ్ముతున్నారని కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని చెప్తున్నారని అన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి అర్‌బీకేల ద్వారా యూరియాను రైతులకు సరఫరా చేశారని గుర్తు చేశారు. అమలాపురం, కొత్తపేట , రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయాల వద్ద రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయాల్లో నియోజకవర్గ కోర్టినేటర్ల అధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలిపి వినతిపత్రాలు అందజేస్తామన్నారు. వరదలు, వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలేదన్నారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి) మాట్లాడుతూ జిల్లాలో యూరియా బస్తా రూ.370 నుంచి 400 విక్రయిస్తున్నారని తెలిపారు. యూరియాను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్న విషయం అధికారులకు తెలుసని అన్నారు. రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ అధినేత జగ్గన్‌మోహన్‌రెడ్డి పోరాటానికి పిలుపునిచ్చారని అన్నారు. నియోజకవర్గ కో ఆర్టినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ యూరియా కొరతపై జరిగే అందోళన విజయంతం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, ఎమ్మెల్సీలు కూడుపూడి సూర్యనారాయణ రావు, బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎంపీ చింతా అనురాధ, నియోజకవర్గ కోఆర్డినేటర్ల డాక్టర్ పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు ఎంపీపీ కూడుపూడి భాగ్యలక్ష్మి, మున్సిపల్ చైర్‌పర్సర్ రెడ్డి నాగేంద్రమణి, పట్టణ, మండల పార్టీ అధ్యక్షుడు సంసాని నాని, గుత్తుల చిరంజీవిరావు, కొనుకు బాపూజీ, నాయకులు నిమ్మకాయల హనుమంతు శ్రీనివాస్, కూడుపూడి బాబు తదితరులు పాల్గొన్నారు.