
అయినవిల్లిలో ముగిసిన నవరాత్ర ఉత్సవాలు
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయంలో చవితి మహోత్సవాల ముగింపు కార్యక్రమాలు గురువారం ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ అల్లు వెంకట దుర్గ భవాని ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన అర్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి విశేష అభిషేకాలు, పూజలు, లక్ష గరిక పూజ, పంచామృతాభిషేకాలు, శ్రీలక్షీగణపతి హోమం నిర్వహించారు. స్వామికి విశేషాలంకారాలు చేశారు. సాయంత్రం పంచహారతులు, గ్రామోత్సవం జరిపారు. అనంతరం ప్రసాదంగా ఉండ్రాళ్లు పంచారు. కేరళ వాయిద్యాలు, గరగ నృత్యాలు, వివిధ చిత్ర విచిత్ర వేషధారణలు ఏర్పాటు చేశారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ భవాని పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం మట్టి గణపతి విగ్రహాన్ని సమీప పంటకాలువలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. సోమవారం ఆలయం వద్ద భారీ అన్నసమారాధన ఏర్పాటు చేశారు.

అయినవిల్లిలో ముగిసిన నవరాత్ర ఉత్సవాలు