
అంధత్వ నివారణకు కృషి
బాదం బాలకృష్ణ ఐ–బ్యాంక్‌ను 2006లో ప్రారంభించాం. తూర్పుగోదావరి, పరిసర జిల్లాల్లో అంధుల జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో 19 మందితో దీనిని స్థాపించి అంధత్వ నివారణకు కృషి చేస్తున్నాం. ఇప్పటివరకు 7,584 కార్నియాలు సేకరించాం. మరణించిన వారి నేత్రాలను దానం చేసేలా కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ చేస్తున్నాం.
– డాక్టర్ బాదం బాలకృష్ణ, ఐ–బ్యాంక్, కాకినాడ
సమాజ సేవలో రెడ్‌క్రాస్
రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ ఐ–బ్యాంక్‌ను ప్రారంభించాం. గతేడాది జనవరి 31న ప్రారంభించగా, మార్చి నుంచి కార్నియాలు సేకరిస్తున్నాం. ఇప్పటి వరకు 248 కార్నియాలు సేకరించాం. మరణానంతరం నేత్రాలు, అవయవాలు వృథా పోనీయకుండా ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు రెడ్‌క్రాస్ ద్వారా కృషి చేస్తున్నాం.
– వైడీ రామారావు, చైర్మన్, రెడ్‌క్రాస్ ఐ–బ్యాంక్, కాకినాడ
ప్రజల్లో స్పందన
జిల్లాలో అంధత్వ నివారణకు విస్తృత చర్యలు తీసుకుంటున్నాం. నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. మరింతగా అవగాహన పెరగాల్సి ఉంది. మరణానంతరం నేత్రదానం చేస్తే ఇద్దరికి చూపును ప్రసాదించవచ్చు. ప్రజల్లో కూడా నేత్రదానంపై స్పందన వస్తోంది.
– డాక్టర్ శ్రీవిద్య, ప్రోగ్రాం మేనేజర్,
జిల్లా అంధత్వ నివారణ సంస్థ, కాకినాడ

అంధత్వ నివారణకు కృషి

అంధత్వ నివారణకు కృషి