
జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్
రాజానగరం: జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం సుమారు నాలుగు గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 108 వంటి అత్యవసర సర్వీసులకు కూడా అవరోధం ఏర్పడింది. రాజానగరం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే మార్గంలో దివాన్‌చెరువు వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఢీ కొన్న లారీ స్టీరింగ్ దెబ్బతినడంతో పక్కకు తీసేందుకు అవకాశం లేక వెనుక నుంచి వచ్చే వాహనాలకు ముందుకు వెళ్లలేక ఆగిపోయాయి. దివాన్‌చెరువు నుంచి ఆదికవి నన్నయ యూనివర్సిటీ వరకు వాహనాలు నిలిపోయాయి. బొమ్మూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ట్రాఫిక్ అంతరాయాన్ని నివారించేందుకు నాలుగు గంటల పైనే సమయం పట్టింది.