
కళ్లలో కారం కొట్టి బంగారం గొలుసు చోరీ
ఐ.పోలవరం: ఇంట్లో టీవీ చూస్తున్న మహిళ కళ్లలో కారం కొట్టి, నాలుగు కాసుల బంగారం గొలుసు ను దొంగలు దోచుకుపోయారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇవీ.. ఐ. పోలవరం మండలం కేశనకుర్రుపాలేనికి చెందిన గాదిరాజు సత్యనారాయణ రాజు, కృష్ణవేణి భార్యాభర్తలు. శుక్రవారం రాత్రి సత్యనారాయణరాజు గదిలో నిద్రిస్తుండగా, ఆయన భార్య కృష్ణవేణి హాల్లో టీవీ చూస్తున్నారు. ఆ సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి.. కృష్ణవేణి కళ్లలో కారం కొట్టారు. ఆమె మెడలోని నాలుగు కాసుల బంగారం గొలుసును లాక్కుని పోయారు. ఆమె తేరుకుని కేకలు వేసేటప్పటికే మోటారు బైక్‌పై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆలయానికి వెళ్లి వస్తుండగా..
పెద్దాపురం: స్వయంభూ తిరుపతి శృంగార వల్లభ స్వామి ఆలయానికి కాలినడకన వస్తున్న మహిళను బెదిరించి, ఆమె మెడలోని నాలుగు కాసుల బంగారం గొలుసును దొంగ లాక్కుని పరారయ్యాడు. పెద్దాపురం మండలం చదలాడ–ఉలిమేశ్వరం గ్రామాల మధ్య శనివారం ఈ ఘటన జరిగింది. కాండ్రకోటకు చెందిన ఒబిలిశెట్టి అమ్మల అనే మహిళ వేకువ జామున కాలి నడకన స్వామివారి గుడికి వస్తోంది. మార్గంమధ్యలో ఉలిమేశ్వరం – చదలాడ గ్రామాల మధ్యలో ఉన్న పామాయిల్ తోట వద్ద గుర్తు తెలియని యువకుడు ఆమెను బెదిరించి, బంగారం గొలుసు లా క్కుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మౌనిక తెలిపారు.