
సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
లాఠీచార్జి దారుణమన్న బీజేపీ నేతలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై త్రీటౌన్ సీఐ సత్యనారాయణ లాఠీచార్జి చేయడం దారుణమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పలువురు పార్టీ నాయకులు మంగళవారం జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. బీహార్‌లో కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోదీ, ఆమె తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోమవారం స్థానిక డీసీసీ కార్యాలయం వద్ద రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు వెళ్లగా, త్రీటౌన్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు తమను అడ్డుకున్నారన్నారు. తమ కార్యకర్తలపై లాఠీచార్జి చేసిన సీఐ.. కర్రలతో రౌడీల్లా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకులను నియంత్రించలేదన్నారు. లాఠీచార్జిలో తమ కార్యకర్తలకు గాయాలు కాగా, స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. తాము కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యులన్న సంగతి మరిచి, పోలీసులు ఇలా దౌర్జన్యం చేయడం తగదన్నారు.
కోడికత్తులతో దాడి కేసులో
నలుగురి అరెస్టు
గోకవరం: కృష్ణునిపాలెం పంచాయతీ పరిధిలో గత ఆదివారం వినాయక నిమజ్జనం ఊరేగింపు నిర్వహిస్తున్న ఓజుబంద గ్రామానికి చెందిన ఇద్దరిపై కోడికత్తులతో దాడి చేసిన నలుగురిని అరెస్టు చేసినట్టు ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు. నిమజ్జనం ఊరేగింపు వెళుతుండగా గోకవరం గ్రామానికి చెందిన గేదెల శివనందు, రాయి అచ్చారావు, పోనసానపల్లి నాగవెంకటసాయి పవన్‌కామేష్, మహిపాల్ వీరవెంకట దుర్గాప్రసాద్ రెండు బైక్‌లపై వచ్చి, ఊరేగింపులో ఉన్న భరత్, రాజేష్‌పై కోడికత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
స్నేహభావంతో
పండగల నిర్వహణ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండగల సందర్భంగా నిర్వహించే ర్యాలీలు ప్రశాంతంగా, స్నేహపూ ర్వక వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలను జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కోరారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన ఏఎస్పీ మనిష్ పాటిల్ దేవరాజ్, డీఆర్వో వెంకటరావు, ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆయా మతపెద్దలతో జిల్లా స్థాయి శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్, మత్స్య, అగ్నిమాపక శాఖల అధికారులు హాజరయ్యారు. వినాయక విగ్రహాల నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండగల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. జిల్లాలో గణేశ్ నిమజ్జనాలు సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను జేసీ ఆదేశించారు. జిల్లాలో మొత్తం 25 నిమజ్జన ప్రదేశాలను గుర్తించామని, నిమజ్జనాలు జరిగే ప్రదేశాల వద్ద స్టేజ్, విద్యుద్దీపాలు, క్రేన్లు, బోట్లు, గజ ఈతగాళ్లు, ఇతర సదుపాయాలను సంబంధిత అధి కారులు కల్పించాలన్నారు. వైద్యారోగ్య శాఖ ద్వా రా నిమజ్జన ప్రదేశాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు, నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహించి, జల కాలుష్యం అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల ఐదున జరిగే మీలాద్ ఉన్ నబీ పండగ సందర్భంగా ముస్లింలకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని జేసీ అధికారులను ఆదేశించారు.

సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్