11న జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

11న జాతీయ లోక్‌ అదాలత్‌

Apr 23 2024 8:15 AM | Updated on Apr 23 2024 8:15 AM

సమావేశంలో మాట్లాడుతున్న తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి మాధురి  - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి మాధురి

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): మే 11వ తేదీన జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించేందుకు రెవిన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులు తమ పరిధిలో ఉన్న రాజీపడదగిన కేసులను గుర్తించాలని తొమ్మిదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి తెలిపారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో ఆమె ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జిల్లా రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా తొమ్మిదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి రాజీపడదగిన జాబితాను అధికారులు సిద్ధం చేసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాష్‌ బాబు, గవర్నమెంటు ప్లీడరు సీహెచ్‌వీ ప్రసాద్‌, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ, పంచాయితీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement