చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్‌

Apr 23 2024 8:15 AM | Updated on Apr 23 2024 8:15 AM

రూ.8.97లక్షల విలువైన 128.27 గ్రాముల ఆభరణాల స్వాధీనం

కొవ్వూరు: వివిధ చోరీలకు పాల్పడిన పాత నేరస్తుడైన చుక్కపల్లి బాబి అనే ప్రవీణ్‌కుమార్‌ను సోమవారం అరెస్ట్‌ చేసినట్లు పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు తెలిపారు. అతని వద్ద నుంచి 128.27 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పా రు. గతంలో కొవ్వూరులో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక ఇంటిలోను, ఆరికిరేవుల గ్రామంలో ఒక రేకుల షెడ్‌లోను, కుమారదేవం, పోలవరంలోను ఇళ్లల్లో పగటి పూట ఎవరూ లేని సమయంలో ఇళ్లల్లోకి చొరబడి విలువైన బంగారు ఆభరణాలు, నగ దు అపహరించుకుని పో యాడన్నారు. సోమవా రం కొవ్వూరు ఏటిగట్టుపై ఉన్న శివాలయం ఎదురుగా ఉన్న వీధిలో నిందితుడు అద్దెకి ఉంటున్న ఇంటి వద్ద అరెస్ట్‌ చేసినట్లు సీఐ తెలిపారు. చోరీ సోత్తు విలువ రూ.8,97,190 ఉంటుందన్నారు. నిందితుడు గోపాలపురం మండలం భీమోలు గ్రామానికి చెందిన వాడన్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు. నిందుతుడిని అరెస్ట్‌ చేయడంలో ఎస్సై కె.జగన్‌మోహన్‌రావు, సిబ్బంది సహకరించారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement