అక్రమ రవాణాను అడ్డుకుంటున్న నిఘా బృందాలు | - | Sakshi
Sakshi News home page

అక్రమ రవాణాను అడ్డుకుంటున్న నిఘా బృందాలు

Apr 19 2024 2:40 AM | Updated on Apr 19 2024 2:40 AM

అమలాపురం టౌన్‌: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఎర వేసే ఏ అక్రమాన్నైనా జిల్లా పోలీసు శాఖ, ఎస్‌ఈబీ, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ నిఘా బృందాలు మాటు వేసి అడ్డుకుంటున్నాయి. జిల్లాలో బుధ, గురువారాల్లో జరిగిన దాడులు, తనిఖీలతో పట్టుబడ్డ మద్యం వివరాలను ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

● అమలాపురం, ముమ్మిడివరం, ఆలమూరు, రాజోలు, కొత్తపేట, రామచంద్రపురం ఎస్‌ఈబీ స్టేషన్ల పరిధిలో ఎనిమిది కేసులకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి ఒక నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యం సీసా, 527 డ్యూటీ పెయిడ్‌ మద్యం సీసాలను, 99 లీటర్ల ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

● ఆలమూరు ఎస్‌ఈబీ స్టేషన్‌ పరిధిలో రెండు కేసులకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.7.86 లక్షల విలువైన 6,240 నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

● జొన్నాడ, గోపాలపురం, బొబ్బర్లంక, దిండి, ఎదుర్లంక, నరసాపురపుపేటల్లో ఏర్పాటు చేసి జిల్లా చెక్‌ పోస్టుల వద్ద గురువారం ప్రతి వాహనాన్ని నిలిపి ఆద్యంతం తనిఖీ చేసిన పిదపే నిఘా బృందాలు వదిలాయి.

Advertisement
 
Advertisement
Advertisement