విలువైన సదస్సు | Sakshi
Sakshi News home page

విలువైన సదస్సు

Published Sun, Nov 19 2023 1:32 AM

- - Sakshi

‘సాక్షి’ మీడియా ఉపయుక్తమైన సదస్సు ఏర్పాటు చేసింది. పోటీ పరీక్షల శిక్షణలో నిష్ణాతురాలైన బాలలత మేడం విలువైన సూచనలిచ్చారు. రానున్న రోజుల్లో జరిగే పోటీ పరీక్షలకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.

– టి.ఐశ్యర్య, డిగ్రీ విద్యార్థి

వివరంగా చెప్పారు

పోటీ పరీక్షల విధానం, సిలబస్‌, సబ్జెక్టులు తదితర అంశాల గురించి లోతుగా, వివరంగా తెలియజేశారు. ఐఏఎస్‌ శిక్షణ సంస్థకు చెందిన వారు వచ్చి ‘సాక్షి’ ఆధ్వర్యాన ఈ సదస్సు నిర్వహించడం సంతోషంగా ఉంది.

– సీహెచ్‌ గణేష్‌, ఎంసీఏ

చక్కగా వివరించారు

పరీక్షకు సన్నద్ధమవ్వడం, ఏ విధంగా ఏకాగ్రతగా ఉండాలి వంటి అంశాలను బాగా వివరించారు. రెగ్యులర్‌ చదువుతో పాటు పోటీ పరీక్షలకు ఎలా సమయం కేటాయించాలి వంటి విషయాలు మనసులో నాటుకునేలా చెప్పారు.

– ఎం.జోషి. డిగ్రీ విద్యార్థి

సంతోషంగా ఉంది

పోటీ పరీక్షల భయాన్ని పోగొ ట్టారు. ఉద్యోగం సాధించాలనే కోరిక ఉన్న వాళ్లకు ఈ సదస్సులో చెప్పిన అంశాలు చాలా బాగా ఉపయోగపడతాయి. నిరుద్యోగ యువతకు ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన ‘సాక్షి’ మీడియాకు ప్రత్యేక అభినందనలు. – కె.దుర్గాదేవి, డిగ్రీ విద్యార్థి

1/3

2/3

3/3

Advertisement
 
Advertisement