Young Farmer Commits Suicide In Vikarabad Over Bad Time In His Life - Sakshi
Sakshi News home page

2014 నుంచి నా టైం బాలేదు.. చనిపోతున్నా

Jan 7 2021 8:56 AM | Updated on Jan 7 2021 7:07 PM

Young Man Takes Life Over Bad Time In His Life - Sakshi

వికారాబాద్‌ : ‘కాలం కలిసి రావడం లేదు.. 2014 నుంచి నా టైం బాగా లేదు.. నేను చనిపోతున్నాను.. అమ్మా నాన్నా.. రైతు బీమా ద్వారా వచ్చే డబ్బులు మీరు తీసుకోండి’అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఓ యువ రైతు చెట్టుకు ఉరేసుకొని తనువు చాలించాడు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా బంట్వారంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన కర్రె నర్సింలు, స్వరూప దంపతుల పెద్దకొడుకు బాల్‌రాజ్‌ (27) కుటుంబానికి పదెకరాల పొలం ఉంది. ( ఫేస్‌బుక్‌ ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందని..! )

ఈసారి వానాకాలం సీజన్‌లో పత్తి సాగు చేశారు. పంటలు సరిగా పండటం లేదని, అప్పులు తీసుకొచ్చి సాగు చేసినా ఫలితం లేకుండా పోతోందని బాల్‌రాజ్‌ కొంతకాలంగా వేదన పడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో నుంచి పొలానికి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement