స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. విషయం తెలిసి.. | Young Man Assassinated Over Extramarital Affair in Tiruvottiyur | Sakshi
Sakshi News home page

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. భర్తకు విషయం తెలిసి..

Published Sun, Oct 9 2022 7:51 AM | Last Updated on Sun, Oct 9 2022 7:51 AM

Young Man Assassinated Over Extramarital Affair in Tiruvottiyur - Sakshi

సాక్షి, తిరువొత్తియూరు (చెన్నై): తిరుపూర్‌ జిల్లా ఎస్‌.పెరియపాలయం పంచాయతీలోని అటవీ ప్రాంతంలో యువకుడి మృతదేహం ఉన్నట్లు శనివారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ జరిపారు. మృతుడు ఈశ్వరన్‌ (30)గా గుర్తించారు. ఈ కేసులో పెరుమానల్లూరుకు చెందిన వడివేలు (39), అతని స్నేహితుడు అన్నాదురై (40)ని అదుపులోకి తీసుకుని విచారించారు.

ఈశ్వరన్, వడివేలు, అన్నాదురై భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. అందరూ పెరుమానల్లూరులో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో ఈశ్వరన్‌ వడివేలు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం వడివేలుకు తెలియడంతో ఈశ్వరన్‌ను మందలించాడు. అయినా తీరు మార్చుకోకపోవడంతో వడివేలు, తన స్నేహితుడు అన్నాదురై కలిసి ఈశ్వరన్‌ను రాళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు తెలిసింది.   

చదవండి: (Sri Sathya Sai District: వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement