పిల్లలకు పురుగుమందు తాపి.. | Women Lost Life By Taking Poison In Mahabubnagar | Sakshi
Sakshi News home page

పిల్లలకు పురుగుమందు తాపి..

Jan 2 2021 10:14 AM | Updated on Jan 2 2021 10:17 AM

Women Lost Life By Taking Poison In Mahabubnagar - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తెలకపల్లి : ఆర్థిక ఇబ్బందులతో తల్లి తన ఇద్దరు పిల్లలకు పురుగు మందు తాపి, తాను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గట్టునెల్లికుదురుకు చెందిన మల్లే, మాధవి భార్యాభర్తలు. ఆర్థిక ఇబ్బందులతో వారు శుక్రవారం ఘర్షణ పడ్డారు. మనస్తాపానికి గురైన మాధవి భర్త పొలానికి వెళ్లిన సమయంలో తన రెండు సందవత్సరాల కుమారుడు నందుకు, ఆరు నెలల పాప మమతకు పురుగు మందు తాపి, తాను తాగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు నాగర్‌కర్నూల్‌ ఏరియా ఆస్పత్రికి వాహనంలో తరలించారు. ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారని, తల్లి మాధవి పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలియజేశారు. 

చికిత్స పొందుతూ బాలిక మృతి 
జడ్చర్ల: మండల పరిధిలోని నసరుల్లాబాద్‌కు చెందిన సుజాత(17) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ షంషద్దీన్‌ తెలిపారు. ఎస్‌ఐ కథ నం మేరకు.. మూడు రోజుల క్రి తం సుజాత పురుగు మందు తా గుగా.. చికిత్స నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా బాధిత కుటుంబాన్ని జెడ్పీ వైస్‌ చైర్మన్‌ యాదయ్య, సర్పంచ్‌ ప్రణీల్‌చందర్‌ పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. 

యువకుడి ఆత్మహత్య 
ఊర్కొండ: పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని మాదారంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మహేశ్‌ చారి(30) అనే యువకుడు తన ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు మహేశ్‌ చారి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు రోధిస్తూ తెలిపారు. మహేశ్‌ చారి తల్లి అంజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement