
సాక్షి, గుంటూరు : జిల్లాలోని లింగంగుంట్లలో దారుణం చోటు చేసుకుంది. కరిముల్లా అనే ఏడేళ్ల బాలుడిని పిన్ని వరుస అయ్యే ఓ మహిళ అతి కిరాతంగా హత్య చేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంగుంట్లకు చెందిన ఓ మహిళ, చీరాలలో ఓ శుభ కార్యానికి వెళ్తూ తన ఏడేళ్ల కుమారుడు కరిముల్లాను చెల్లెలు ఆసియాకు అప్పజెప్పింది. ఈ క్రమంలో ఆసియా కత్తితో కరిముల్లాపై దాడి చేసింది.
బాలుడి పొట్టకోసి హత్య చేసింది. అనంతరం రక్తాన్ని ముఖానికి పూసుకొని బయటకు పరుగులు తిసింది. స్థానికులపై కత్తితో దాడికి యత్నించగా, పట్టుకొని చేతులు కట్టేశారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఇంటికి తిరిగి వచ్చిన బాలుడి తల్లిదండ్రులు.. విగతజీవిగా పడిఉన్న కుమారుడిని చూసి బోరున విలపించారు. కొంతకాలంగా ఆసియాకు మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు.