బంధువు కాదు.. కామాంధుడు.. మహిళకు లైంగిక వేధింపులు | Sakshi
Sakshi News home page

బంధువు కాదు.. కామాంధుడు.. మహిళకు లైంగిక వేధింపులు

Published Fri, Sep 9 2022 11:45 AM

Woman Assaulted By Relative In Konaseema District - Sakshi

అమలాపురం టౌన్‌(కోనసీమ జిల్లా): వరుసకు సోదరుడైన పి.గణేష్‌ తనను లైంగికంగా వేధిస్తున్నాడని రాజోలు మండలం శివకోడుకు చెందిన బాధిత మహిళ అమలాపురంలోని ఎస్పీ కార్యాలయానికి గురువారం వచ్చి ఫిర్యాదు చేసింది. దళిత బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్‌ కొంకి రాజామణి, మానవ హక్కుల వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాసరావులతో కలిసి బాధితురాలు ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఏఎస్పీ లతా మాధురికి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది.
చదవండి: సంతోషం.. సరదా కబుర్లు.. అంతలోనే ఘోరం..

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసు స్టేషన్‌లో నిందితుడు గణేష్‌పై దిశ కేసు నమోదైందని రాజామణి తెలిపారు. అయిన్పటికీ రాజోలు పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకోవడం లేదని వారు ఏఎస్పీకి వివరించారు. నిందితుడిపైనా... కేసు పట్ల సరిగా స్పందించని పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని తాము ఏఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు రాజామణి, శ్రీనివాసరావు అమలాపురంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement