దారుణం: నిద్ర మాత్రలిచ్చి కుటుంబ సభ్యులనే కిరాతకంగా..

West Bengal: Youth Arrested Assasinated Four Family Members Inside House - Sakshi

కోల్‌కతా: అడిగిన డబ్బులు ఇవ్వలేదని కుటుంబ సభ్యులను ఓ ఇంటర్‌ విద్యార్థి కిరాతకంగా కడతేర్చాడు. ఈ ఘటన జరిగి సుమారు నాలుగు నెలలు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఈ దారుణం పశ్చిమ బెంగాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిందితుడు ఆసిఫ్ మొహమ్మద్ తన కుటుంబానికి కాలయముడిగా మారాడు. నాలుగు నెలల క్రితం ఆసిఫ్‌ తన తల్లి, తండ్రి, సోదరితో పాటు 62 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేశాడు. 

కాగా ఈ సంఘటన నుంచి నిందితుడి సోదరుడు ఆరిఫ్ మొహమ్మద్ తప్పించుకున్నాడు.. అయితే ఆసిఫ్ అకృత్యాన్ని ఎట్టకేలకు బయటపెట్టాలని నిర్ణయించుకున్న అతని సోదరుడు.. కాలియాచోక్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించటంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఫిబ్రవరి 28 న, ఆసిఫ్ కుటుంబ సభ్యులందరికీ నిద్ర మాత్రలు కలిపిన శీతల పానీయాలను అందించాడు. వారు అపస్మారక స్థితిలో చేరడంతో, అతి కిరాతకంగా హత్య చేసి ఆ ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టాడు. దీంతో పోలీసులు ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడిందని తెలిపారు. ఆసిఫ్ నిత్యం తన తండ్రి డబ్బులకోసం డిమాండ్ చేసేవాడని స్థానికులు పేర్కొన్నారు. హత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

చదవండి: దొంగతనం కేసులో ‘క్రైమ్​ పెట్రోల్’  సీరియల్‌ యాక్టర్స్‌ అరెస్టు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top