
సాక్షి నెట్‌వర్క్: టీడీపీ కార్యకర్తల విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రగతి పనులకు సంబంధించిన శిలాఫలకాలను పలుచోట్ల ధ్వంసం చేశారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెం సచివాలయ భవన నిర్మాణానికి సంబందించిన శంకుస్థాపన శిలాఫలాకాన్ని టీడీపీ కార్యకర్తలు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. అప్పటి ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు, మండల ప్రజాప్రతినిధుల పేర్లతో ఈ శిలాఫలకాన్ని ఏర్పాటుచేయగా.. దానిని పగులగొట్టారు. టీడీపీ నాయకుడు, సర్పంచ్ యర్రా రామకృష్ణ ఇంటి ముందు రోడ్డు నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సైతం ధ్వంసం చేశారు.
జెండా దిమ్మె ధ్వంసం
తిరుపతి జిల్లా చంద్రగిరికోటలో వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మెను మంగళవారం తెల్లవారుజామున టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చంద్రగిరిలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని పోలీసులను వైఎస్సార్‌సీపీ నాయకులు కోరారు.
జగనన్న కాలనీలో రాళ్లు ధ్వంసం
పశి్చమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొత్తపూసలమర్రులో టీడీపీ నాయకులు దాషీ్టకానికి తెగబడ్డారు. జగనన్న కాలనీలో సరిహద్దు రాళ్లు ధ్వంసం చేశారు. పైప్‌లైన్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. గ్రామ టీడీపీ నాయకులు కొల్లాటి గోవిందరాజు, బస్వాని పోతురాజు, బర్రి నాగరాజు, జల్లా బుజ్జి, బొమ్మిడి పోతురాజు, ఒడుగు సామోరు, కొయ్యలగడ్డ బాలాజీ తదితరులు వచ్చి పైప్‌లైన్ పనులను అడ్డుకున్నారని గ్రామస్తులతోపాటు అభివృద్ధి కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. లబి్ధదారులు మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని, జగనన్న ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇస్తే పనులను అడ్డుకుంటున్నారని లబి్ధదారులు ఆవేదన వ్యక్తం చేశారు.