నారాయణఖేడ్‌లో బొలేరో వాహనం బీభత్సం

Two Sanitation Workers Deceased In Road Accident - Sakshi

ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతి  

సాక్షి, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ర్యాకల్ రోడ్డులో బొలేరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు శుభ్రం చేస్తున్న ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులను వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సత్యమ్మ, విట్టమ్మ అనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. నాలుగు దుకాణాలతో పాటు విద్యుత్‌ స్తంభాన్ని కూడా బొలేరో వాహనం ఢీ కొట్టింది. దుకాణాలు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ ఫుల్లుగా మద్యం మత్తులో వాహనం నడిపాడని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి పరిశీలించారు.

చదవండి: ఆడపిల్లలు పుట్టారని రోజూ వేధింపులు.. భార్య ఆత్మహత్య
ప్రేమ వేధింపులు: అల్లుడిని హత్య చేసిన మామ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top