కల్తీ మద్యం కలకలం? 

Two Man Dies After Drinking Adulterated Alcohol in Nagarkurnool - Sakshi

ఒకే షాపు నుంచి మద్యం కొనుగోలు చేసి.. తాగిన ఇద్దరు ఆకస్మిక మృతి 

కల్తీ మద్యం వల్లే చనిపోయారని కుటుంబసభ్యుల ఆరోపణ  

అనుమానంతో శాంపిల్స్‌ సేకరించిన ఎక్సైజ్‌ అధికారులు 

నాగర్‌కర్నూల్‌ క్రైం: ఒకే షాపు నుంచి మద్యం కొనుగోలు చేసి తాగిన ఇద్దరు వ్యక్తులు అను మానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతులు కుటుంబసభ్యుల కథనం మేరకు... నాగర్‌కర్నూల్‌ మండలం నల్లవెల్లికి చెందిన నర్సింహ(45) సోమవారం సాయంత్రం నాగర్‌కర్నూల్‌ బస్టాండ్‌ సమీపంలోని ఓ మద్యం దుకాణం ఎదుట అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా అర్ధరాత్రి పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులు గమనించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

మరో ఘట నలో మండలంలోని కుమ్మెరకు చెందిన ఊషన్న(50) బ్యాంకులో నగదును తీసుకునేందుకు మంగళవారం ఉదయం జిల్లాకేంద్రానికి వచ్చా డు. డబ్బులు తీసుకున్న తర్వాత మద్యం తాగి తిరిగి వెళ్తూ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల ప్రహరీ వద్ద  కిందపడి మృతిచెందాడు. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా ఊషన్న జేబులో మద్యం సీసా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నర్సింహ, ఊషన్న ఇద్దరూ కల్తీ మద్యం తాగి మృతి చెందినట్లు వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. 

శాంపిల్స్‌ సేకరించిన ఎక్సైజ్‌ అధికారులు 
జిల్లా కేంద్రంలో ఇద్దరు కల్తీ మద్యం తాగి మృతి చెందినట్లు ఆరోపణలు రావడంతో ఎక్సైజ్‌ డీటీఎఫ్‌ సీఐ పరమేశ్వర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం బస్టాండ్‌ సమీపంలోని మోతీ వైన్స్‌లో తనిఖీలు నిర్వహించి పలు బ్రాండ్లకు సంబంధించి శాంపిల్స్‌ సేకరించారు.

కాగా మృతులు ఇద్దరూ మద్యం కొనుగోలు చేసింది ఒకే వైన్స్‌ నుంచే కావడం కల్తీ మద్యం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ విషయమై ఎక్సైజ్‌ ఈఎస్‌ ఫయాజుద్దీన్‌ను వివరణ కోరగా మోతీ వైన్స్‌ నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top