ఆ కోరికే విద్యార్థులను లేచిపోయేలా చేసింది...

Two Gujarat School Students Eloped For Living Like A Couple - Sakshi

వడోదర : తెలిసీ తెలియని వయసు.. దంపతులుగా బ్రతకాలన్న కోరిక ఇద్దరు స్కూలు విద్యార్థులను తప్పుదారి పట్టించింది. తల్లిదండ్రులను వదిలి ఇళ్లు విడిచి దూరంగా పారిపోయేలా చేసింది. ఈ సంఘటన గుజరాత్‌లోని వడోదరలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. వడోదరలోని ఛాని గ్రామానికి చెందిన ఇద్దరు స్కూలు విద్యార్థులు గత కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. మార్చి నెలలో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా స్కూళ్లు మూసివేయటంతో ఇద్దరూ కలుసుకోవటం కుదరలేదు. దీంతో వారు ఇంటినుంచి పారిపోయి దంపతుల్లాగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు. డిసెంబర్‌ 28వ తేదీన ఇంటినుంచి పారిపోయారు. బాలుడు 25 వేల రూపాయలు, బాలిక ఐదు వేల రూపాయలు పట్టుకెళ్లారు. ( చికెన్‌ లేదన్నాడని ఎంత పని చేశారు.. )

సయాజిగంజ్‌లో నెలకు 500 రూపాయల అద్దెతో ఓ ఇళ్లు బాడుగకు తీసుకున్నారు. బాలుడు ఓ గార్మెంట్‌ కంపెనీలో పనిచేస్తూ రోజుకు 366 రూపాయలు సంపాదించేవాడు. ఆ డబ్బును ఇంటి నిర్వహణ కోసం ఖర్చు చేసేవారు. తమ పిల్లలు కనిపించకుండా పోవటంతో ఇరు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ రోజు సదరు బాలుడు అతడి మిత్రుడికి ఫోన్‌ చేయగా పోలీసులు ట్రాక్‌ చేశారు. అనంతరం అతడి ఆచూకీ తెలుసుకుని ఇద్దర్నీ సొంత గ్రామానికి తీసుకువచ్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top