శామీర్‌పేట చెరువులో శవాలై తేలిన డాక్టర్లు, సెల్ఫీనే కారణమా?

Two Doctors Ends Life In Shamirpet Pond - Sakshi

మేడ్చల్: శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద చెరువులో దూకి ఇద్దరు యువ డాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇద్దరు వైద్యులు ఆదివారం సాయంత్రం ఎఫ్‌జడ్‌ బైక్‌పై వచ్చి శామీర్‌పేట చెరువులో దూకినట్లు తెలిపారు. వీరిలో ఒకరు అల్వాల్‌ ఎక్సెల్‌ ఆస్పత్రిలో హోమియోపతి జూనియర్‌ డాక్టర్‌ నందన్ కాగా.. మరొకరు ఆయుర్వేదిక్‌ వైద్యుడు గౌతంగా వెల్లడించారు.

అల్వాల్‌ సూర్య నగర్‌ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసముండే ఈ ఇద్దరు వైద్యులు అన్నాదమ్ములని పోలీసులు తెలిపారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటికి తీసినట్టు వెల్లడించారు. డాక్టర్లిద్దరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వారిద్దరూ ఆత్మహత్య చేసకున్నారా? లేక ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోయారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బైక్‌ వెళ్లి చెరువులో శవాలుగా తేలారని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

శామీర్‌పేట్‌ అన్నదమ్ముల మృతికి సేల్ఫీనే కారణమా?
ఈ ఘటనపై శామీర్‌పేట సీఐ మాట్లాడుతూ.. యువ డాక్టర్లు ఫోటోలు తీసుకుంటుండగా చెరువులో జారీ పడిపోయినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. కాగా, వారం రోజుల క్రితం నందన్ దగ్గరకి సోదరుడు గౌతం వచ్చినట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఇద్దరు కలిసి శామీర్‌పేట చెరువు వద్దకు వచ్చినట్లు తెలిపారు. నందన్ ఫోటోలు తీసుకునే క్రమంలో నీటిలో పడిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నందన్‌ను కాపాడేందుకు గౌతం నీటిలో దూకి ఉంటాడని అన్నారు. కాగా ఈతగాళ్లు ఇద్దరు యువ డాక్టర్ల మృత దేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్ట్‌ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు శామీర్‌పేట సీఐ తెలిపారు.

చదవండి: భూతగాదాలు, పాత కక్షలు.. పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top