ఇన్నోవాలో రెండు ఆవుల తరలింపు

Two Cows Transport In Innova Car In Nalgonda District - Sakshi

కేతేపల్లి: ఇన్నోవా కారులో రెండు ఆవులను కుక్కి హైదరాబాద్‌లోని కబేళాకు తరలిస్తుండగా గురువారం కేతేపల్లి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిపై కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద గురువారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు.

ఈ క్రమంలో ఇన్నోవా కారులో రెండు ఆవులను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎం.అనిల్‌రెడ్డి తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top