మేకను తప్పించి సింహానికి బలైన యువకుడు

Tries To Save A Goat Lion Kills 35 Year Old Man In Gujarat - Sakshi

అహ్మదాబాద్‌: మామిడి తోట కాడ కాపు కాస్తుండగా హఠాత్తుగా సింహం వచ్చింది. ఆ సింహ మేకను తినేద్దామని ప్రయత్నించగా ఆ మేకను కాపు కాస్తున్న వ్యక్తి తప్పించాడు. అయితే సింహం మేకను కాదని ఆ వ్యక్తిని తన ఆహారంగా చేసుకుని తినేసింది. సింహం చేతిలో మనిషి బలైన సంఘటన గుజరాత్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది జూనాగఢ్‌ జిల్లా గిర్‌ అటవీ డివిజన్‌లోని తలాలా రేంజ్‌ పరిధిలో ఉన్న మధుపూర్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

మధుపూర్‌ గ్రామంలో మామిడి తోటకు బహదూర్‌భాయ్‌ జీవాభాయ్‌ (35) కావలి ఉంటున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి గ్రామ సమీపంలోని మామిడి తోటకు కాపలా ఉంటూ నిద్రించాడు. అయితే శనివారం తెల్లవారుజామున అడవిలో నుంచి సింహం బయటకు వచ్చింది. తోట సమీపంలోకి రాగా మేక కనిపించింది. మంచానికి కట్టేసిన మేకను తినేయాలని చూడగా మేక అరుపులకు బహదూర్‌భాయ్‌ జీవాభాయ్‌ మేల్కొన్నాడు. సింహం నుంచి మేకను తప్పించాడు. మేక తప్పించుకోగా జీవాభాయ్‌ సింహానికి చిక్కాడు. సింహం పంజా విసిరి జీవాభాయ్‌పైకి దాడి చేసి తినేసింది. అతడి అరుపులు విన్న గ్రామస్తులు వెంటనే తోట కాడికి చేరుకున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సింహాన్ని బంధించారు.

చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌
చదవండి: వ్యాక్సిన్‌ కొరత తీవ్రం.. పిల్లలకు కూడా వేయించాలి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top