వివాహేతర సంబంధం అనుమానం.. భార్య ముఖాన్ని నేలకు బాది.. | Telangana: Husband Asasinated Wife Over Extra Marital Affair | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం అనుమానం.. భార్య ముఖాన్ని నేలకు బాది..

Mar 19 2022 8:56 AM | Updated on Mar 19 2022 11:33 AM

Telangana: Husband Asasinated Wife Over Extra Marital Affair - Sakshi

సాక్షి,వాంకిడి(అదిలాబాద్‌): అనుమానం పెనుభూతమై భర్త భార్యను హత్య చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై దీకొండ రమేశ్‌ తెలి పిన వివరాలు.. మండలంలోని లక్ష్మీనగర్‌లో కొరగంటి పోశం, కమల (50) దంపతులు గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. భార్య కమల అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో వేధించేవాడు. పోశం తరచూ మద్యం తాగి వచ్చి చిత్రహింసలకు గురిచేసేవాడు.

ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో అతిగా మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. కోపాద్రిక్తుడైన పోశం కమల ముఖాన్ని నేలకు బాదడంతో సృహా తప్పింది. కుమారుడు స్వామి తన మేనమామ శంకర్‌కు సమాచారం అందించగా అత డు వచ్చి చూసేసరికి కమల రక్తపుమడుగులో ఉంది. మృతురాలి తమ్ముడు శంకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement