నామినేషన్‌ వేస్తే చంపేస్తాం! | TDP Leaders Threaten Sarpanch Candidate In Chittoor District | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ వేస్తే చంపేస్తాం!

Feb 11 2021 8:58 AM | Updated on Feb 11 2021 9:00 AM

TDP Leaders Threaten Sarpanch Candidate In Chittoor District - Sakshi

రేణిగుంట(చిత్తూరు జిల్లా): మండలంలోని జి.పాళెం పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు సిద్ధమైన ఝాన్సీరాణి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు నేరుగా ఇంటికే బెదిరించారు. నామినేషన్‌ వేస్తే హతమారుస్తామని హెచ్చరించారు. గాజులమండ్యం పోలీసుల కథనం మేరకు.. జి.పాళెం పంచాయతీ సర్పంచ్‌ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయింది. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు వైఎస్సార్‌సీపీ అభిమాని నారాయణరెడ్డి భార్య ఝాన్సీరాణి ఆసక్తి చూపించారు.

గురువారం నామినేషన్‌ వేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. అయితే బుధవారం సాయంత్రం నలుగురు వ్యక్తులు నేరుగా ఆమె ఇంటికి వెళ్లి నామినేషన్‌ వేయవద్దని సూచించారు. మాట వినకుండా నామినేషన్‌ వేస్తే చంపేస్తామని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన ఝాన్సీరాణి వెంటనే ఎంపీడీఓ కార్యాలయ ఏఓ హరిబాబుకు సమాచారం అందించింది. ఆయన సూచన మేరకు బాధితురాలు గాజులమండ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
(చదవండి: కోరి తెచ్చుకుంటే కొంప ముంచాయి!)
పేట్రేగిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు..    

Advertisement
 
Advertisement
Advertisement