టీడీపీ ప్రలోభాలు | TDP Leaders arrested by police for moving alcohol | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రలోభాలు

Feb 1 2021 5:00 AM | Updated on Feb 1 2021 5:00 AM

TDP Leaders arrested by police for moving alcohol - Sakshi

నిందితులను చూపుతున్న పోలీసులు

నల్లచెరువు: పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి టీడీపీ తెరలేపింది. అనంతపురం జిల్లా నల్లచెరువుకు చెందిన టీడీపీ నాయకులు మల్లికార్జుననాయుడు, కుసుమకుమార్‌ నాయుడు ఓటర్లకు పంచేందుకు మద్యాన్ని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. ముందస్తు సమాచారంతో పోలీసులు స్థానిక వేమన ఆలయం సమీపాన గల మద్యం షాపు వద్ద మాటు వేయగా.. టీడీపీ నాయకులు మల్లికార్జున నాయుడు, కుసుమకుమార్‌ అక్రమంగా మద్యం తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి 180 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను జడ్జి ముందు హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. నిందితులు టీడీపీ మద్దతుతో తలమర్లవాండ్లపల్లి సర్పంచ్‌ అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేసిన హర్షవర్ధన్‌ నాయుడు, హేమావతి సమీప బంధువులు. మల్లికార్జున నాయుడు, హర్షవర్ధన్‌ నాయుడుకు స్వయాన బావమరిది. నిందితులతో సంబంధం ఉన్న అభ్యర్థులు హర్షవర్ధన్‌నాయుడు, హేమావతి నామినేషన్లను రద్దు చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement