భార్య చేసిన పనికి.. అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు

Tamilnadu: Man Fires Mother In Law House Over Wife Second Marriage - Sakshi

వేలూరు(చెన్నై): తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపంలోని వళయంపట్టు గ్రామానికి చెందిన జయేంద్రన్‌. ఇతని కుమార్తె నిషా. నిషాకు కల్లకురిచ్చికి చెందిన రమేష్‌తో  20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. అయితే గత ఏడు సంవత్సరాలుగా భార్యాభర్తలు విడిపోవడంతో భార్య నిషా రెండవ వివాహం చేసుకుని రెండవ భర్త రవికుమార్‌తో కలిసి జీవిస్తోంది. ఈ నేపథ్యంలో నిషా మొదటి భర్త రమేష్‌ వీరిని నిలదీశారు.

దీనిపై ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఇదిలా ఉండగా శనివారం రాత్రి అత్తింటికి∙వచ్చిన రమేష్‌ ఆగ్రహించి నిప్పు పెట్టాడు. ఈ విషయాన్ని భార్య నిషాకు ఫోన్‌ చేసి చెప్పాడు. గమనించిన స్థానికులు మంటలను అదుపు చేసి వాణియంబాడి పోలీసులు సమాచారం అందించారు. అనంతరం రమేష్‌ను అదుపులోకి తీసుకుని ఈమేరకు కేసు దర్యాప్తు  చేస్తున్నారు.

చదవండి: ఐదేళ్లుగా అమ్మాయి కోసం చూసి చూసి.. చివరికి ఇలా..!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top