ఐదేళ్లుగా అమ్మాయి కోసం చూసి చూసి.. చివరికి ఇలా..!

Tamil Nadu Putting Up Posters Looking For Bride Viral - Sakshi

గత ఐదేళ్లుగా సరైన జోడి కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నా. కానీ, దొరకట్లేదు. సంబంధాల కోసం ఎంతో డబ్బు ఖర్ఛు చేశాం.. ఫలితం లేదు. ఏం చేయను.. తప్పట్లేదు అంటూ ఆ యువకుడు చేసిన పని ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. 

తనకు నచ్చిన, తనను మెచ్చిన అమ్మాయిని వెతుక్కోవడం కోసం తమిళనాడులోని విల్లపురానికి చెందిన ఎమ్మెస్‌ జగన్‌ వినూత్న చర్యకు దిగాడు. ‘పేరు: ఎమ్మెస్‌ జగన్‌. వయస్సు: 27 ఏండ్లు. జీతం నెలకు నలభైవేలు. నాకు వధువు కావలెను’ అంటూ కులం, ఇతర వివరాలతో పాటు మధురై అంతటా రోడ్ల కూడళ్లలో బ్యానర్లు, వాల్‌ పోస్టర్లు వేశాడతను. ఓ కంపెనీలో మేనేజర్‌గా పని చేసే జగన్‌.. పార్ట్‌ టైంలో డిజైనర్‌గా కూడా పని చేస్తున్నాడు.

నా పనిలో భాగంగా ఎంతో మంది కోసం..  ఎన్నో పోస్టర్లు డిజైన్‌ చేశా. నా కోసం ఎందుకు డిజైన్‌ చేసుకోకూడదు అనిపించింది. అందుకే ఇలా అంటున్నాడు ఆ యువకుడు.  ఎంతో మంది అమ్మాయిని చూస్తామంటూ డబ్బులు కూడా తీసుకున్నారు. కానీ, ఎవరూ సరిపోయే జోడిని తేలేకపోయారు. అందుకే ఈ ప్రయత్నం అంటున్నాడు అతను. అయితే.. పోస్టర్లు పెట్టాక ఏమైనా సంబంధాలు వస్తున్నాయా? అంటే.. అబ్బే లేదంట. కేవలం.. మ్యారేజ్‌ బ్రోకర్లు మాత్రమే ఫోన్లు చేస్తున్నారట పాపం. 

నైంటీస్‌లో పుట్టిన తనకు ఇదొక టఫ్‌ టైం అంటున్నాడు ఎమ్మెఎస్‌ జగన్‌. ఇంటర్నెట్‌లో మీమ్స్‌తో పాటు కొంతమంది ఫోన్‌ కాల్స్‌ చేసి.. పాపం అతన్ని పెళ్లి చూపులంటూ ఏడ్పించారట కూడా. కానీ, ఎవరినీ పట్టించుకోకుండా ఈ ప్రయత్నం ఆపనంటున్నాడు అతను. ఒకవేళ.. త్వరలో మంచి సంబంధం గనుక కుదిరితే.. కృతజ్ఞతలతో మరొక పోస్టర్‌ తయారు చేస్తాడంట.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top