శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య 

Student Commits Suicide At Sri Chaitanya College Vijayawada - Sakshi

పునాదిపాడు క్యాంపస్‌లో ఘటన 

మృతురాలు అనంతపురం వాసి 

సాక్షి, కంకిపాడు: కృష్ణా జిల్లాపునాదిపాడు శ్రీచైతన్య క్యాంపస్‌లో ఇంటర్‌ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అనంతపురానికి చెందిన దాసరి లాస్యశ్రీ (16)ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతోంది. బుధవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోరంకిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఎస్‌ఐ వై. దుర్గారావు సహచర విద్యార్థులను విచారించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దుర్గారావు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top