రెడ్‌ మీ ఫోన్ల లారీపై మరోసారి దొంగల పంజా

Rs 70 Lakhs Worth Mobile Phones Looted In Guntur District - Sakshi

గుంటూరు: చిత్తూరు జిల్లా నగరిలో మొబైల్‌ ఫోన్ల కంటైనర్‌ దొంగతనం మరువకముందే అలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. గుంటూరు-కోల్‌కత హైవే (ఎన్‌హెచ్‌-16)పై బుధవారం భారీ చోరీ జరిగింది. శ్రీసిటీ నుంచి కోల్‌కత వెళ్తున్న మొబైల్ ఫోన్ల లారీలో రూ.70 లక్షల విలువైన రెడ్ మీ ఫోన్లను దుండగులు అపహరించారు. తన లారీలో దొంగతనం జరిగిందని గుర్తించిన డ్రైవర్‌ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఇదిలాఉండగా. తమిళనాడులోని శ్రీపెరంబూర్‌ నుంచి ముంబైకి వెళ్తున్న మొబైల్‌ ఫోన్ల లారీలో గత ఆగస్టు 26న దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. కంటైనర్‌ ఆంధ్రా బార్డర్‌ నగరి వద్దకు రాగానే లారీని అడ్డం పెట్టిన దుండగులు.. డ్రైవర్‌ను కొట్టి అందులోని 6 కోట్ల రూపాయల విలువైన మొబైల్‌ ఫోన్లను ఎత్తుకెళ్లారు.
(చదవండి: సినీ ఫక్కీలో కంటైనర్‌ లూటీ)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top