రైల్వే సిగ్నల్స్‌ ట్యాంపర్‌..రెండు రైళ్లలో దోపిడీ | Robbery in two trains | Sakshi
Sakshi News home page

రైల్వే సిగ్నల్స్‌ ట్యాంపర్‌..రెండు రైళ్లలో దోపిడీ

Published Thu, Jun 13 2024 5:40 AM | Last Updated on Thu, Jun 13 2024 5:46 AM

Robbery in two trains

మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలు.. బ్యాగులు అపహరణ 

బిట్రగుంట: విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలోని కా­వలి– శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య బుధ­వారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తు­లు రెండు రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే సిగ్నల్స్‌ను ట్యాంపర్‌ చేయడం ద్వారా రెడ్‌ సిగ్నల్‌ వేసి రైళ్లను నిలిపి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. 

రైల్వే జీఆ­ర్పీ అధికారుల సమాచారం మేరకు.. కావలి–శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో తెల్లవారుజామున 1.50 గంటల సమ­యంలో గుర్తుతెలియని వ్యక్తులు సిగ్నలింగ్‌ వ్య­వ­స్థను ట్యాంపర్‌ చేసి రెడ్‌ సిగ్నల్‌ పడేలా చేశారు. ఆ సమయంలో  నరసాపురం నుంచి ధర్మవరం వెళుతు­న్న ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ (నంబరు 17247)ను నిలిపివేసి ఎస్‌–11, ఎస్‌–13 బోగీల్లోకి ప్రవేశించారు. 

ఇద్ద­రు మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలు­సు­లు, బ్యాగులు చోరీ చేసి పారిపోయారు. ఈ ఘట­న జరిగిన 20 నిమిషాల తర్వాత అదే మార్గంలో వ­చి్చ­న షిర్డిసాయినగర్‌ నుంచి తిరుపతికి వెళ్తున్న తిరు­పతి స్పెషల్‌ (07638) ట్రైన్‌ను ఇదే తరహాలో నిలిపి ఎస్‌­–3, ఎస్‌–5 కోచ్‌ల్లోకి ప్రవేశించారు. ఇద్ద­రు మహిళా ప్రయాణికుల మెడల్లోని 38 గ్రాముల బంగా­­రు గొలుసులు, బ్యాగులు అపహరించారు. 

ఈ క్రమంలో దోపిడీని అడ్డుకునేందుకు ఓ ప్రయాణికు­డు ప్రయత్నించగా రాళ్లతో దాడి చేసి గాయపరిచా­రు. అనంతరం పక్కనే ఉన్న కొండబిట్రగుంట అట­వీ ప్రాంతంలోకి పారిపోయారు. రైల్వే పోలీసు­లు దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement