లాడ్జిలో రిమాండ్‌ ఖైదీ సరసాలు

Police Raided Undertrial Prisoner With  Girlfriend In Lodge - Sakshi

హుబ్లీ: పేరుమోసిన నేరగాడు, విచారణ ఖైదీ లాడ్జిలో ప్రేయసితో ఉండగా పోలీసులు దాడి చేశారు. వివరాలు... బచ్చా ఖాన్‌ అనే వ్యక్తిపై అనేక కేసులు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో బళ్లారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధార్వాడలో మరో కేసు విచారణ కోసం శనివారం తీసుకెళ్లారు. అదే అదనుగా అతడు రాత్రికి ప్రియురాలిని ఓ లాడ్జికి పిలిపించి, తానూ అక్కడే మకాం వేశాడు.

ఇందుకు ఎస్కార్టుగా వచ్చిన బళ్లారి పోలీసులు తమవంతు సహకారం అందించారు. దీన్ని పసిగట్టిన ధార్వాడ పోలీసులు తక్షణమే సదరు లాడ్జిపై దాడి చేసి బచ్చాఖాన్‌ను ధార్వాడ విద్యానగర్‌ స్టేషన్‌కు  పట్టుకెళ్లారు. నిందితునితో చేయి కలిపారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో బళ్లారి ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ యోగీష్‌ ఆచారి, పోలీస్‌ కానిస్టేబుళ్లు శివకుమార్, రవికుమార్, సంగమేశ కాళగిలను బళ్లారి జిల్లా ఎస్పీ సస్పెండ్‌ చేశారు. లాడ్జి పై దాడి సమయంలో బచ్చా ఖాన్‌ తప్పించుకోవడానికి ప్రయతి్నంచాడని తెలిసింది.  

(చదవండి: డాదిలో రూ.60,414 కోట్ల సైబర్‌ మోసాలు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top