HYD: డేటా చోరీ కేసులో రంగంలోకి దిగిన ఆర్మీ

Police Identified Hyderabad Man Involved In Data Theft Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డేటా చోరీ కేసులో ఆర్మీ రంగంలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులతో రక్షణ రంగ ఉన్నతాధికారుల భేటీ అయ్యారు. 2.55 లక్షల మంది తమ ఉద్యోగుల వివరాలు ఉండటంపై ఆరా తీశారు. జాతీయ భద్రతకు ముప్పు కావడంతో ఆర్మీ సీరియస్‌గా దృష్టి సారించింది.

నిందితుల వద్ద జాతీయ రాజధాని పరిధిలో పని చేసే 2.55 లక్షల మంది డేటా లభ్యం కాగా, తమ ఉద్యోగుల డేటా నకలు ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డేటా లీకేజీ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కేసులో భాగంగా డేటా ప్రొవైడర్ జస్ట్ డయల్‌ను కూడా పోలీసులు విచారించనున్నారు.

సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన సిట్ ద్వారా కేసు  విచారణ చేపట్టనున్నారు. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న డేటాను తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అండ్ సైబర్ సేఫ్టీ ద్వారా​ పోలీసులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్‌లో డేటాచోరీకి సంబంధించి నగరానికి చెందిన వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top