
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై : ఫేస్‌బుక్‌లో విద్యార్థిని ఫొటో అప్‌లోడ్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఓరగడం గాంధీనగర్ ఆలయ వీధికి చెందిన మహదేవన్ (25) ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. అతనికి అదే ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. వీరి ప్రేమ వ్యవహారం విద్యార్థిని ఇంట్లో వారికి తెలియడంతో అభ్యంతరం తెలిపారు. దీంతో మహదేవన్ నేరుగా కలుసుకోవడం మానేసి విద్యార్థినితో ఫోన్‌లో మాట్లాడేవాడు.
ఒకరోజు కలుద్దామంటూ కోరడంతో అందుకు ఆ యువతి నిరాకరించింది. దీంతో ఆగ్రహం చెందిన మహదేవన్ విద్యార్థిని ఫొటోను సెల్‌ఫోన్ నెంబరును ఫేస్‌బుక్‌లో పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబత్తూరు మహిళా పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రమణి నేతృత్వంలో పోలీసులు విచారణ చేపట్టి గురువారం ఉదయం మహదేవన్‌ను అరెస్టు చేశారు. (నడిరోడ్డుపై యువతి కిడ్నాప్)