నయవంచకుడు; రాజకుటుంబం పేరుతో యువతులకు వల

Person Cheated Young Girls By Fake Profile In Matrimonial Site - Sakshi

బనశంకరి: మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లలో మైసూరు రాజకుటుంబం బంధువునని ప్రొఫైల్స్‌ పెట్టుకుని యువతులను పెళ్లి పేరుతో నమ్మించి రూ.40 లక్షలు స్వాహా చేసిన సిద్ధార్థ్‌ అనే వంచకున్ని  వైట్‌ఫీల్డ్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు స్మార్ట్‌ ఫోన్లు, పలు బ్యాంకుల డెబిట్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ దేవరాజ్‌ తెలిపారు. తన పేరు సిద్ధార్థ్‌ అరస్‌ అని, అమెరికాలో ఐటీ ఇంజనీరునని ప్రొఫైళ్లు పెట్టుకున్నాడు. ఆంగ్లం, స్పానిష్‌ మాట్లాడుతూ యువతులను బుట్టలో వేసుకుని ఏదో కారణంతో వారి నుంచి భారీగా డబ్బు గుంజడం ఇతని నైజం. పలువురు ఫిర్యాదు చేయడంతో మైసూరు జిల్లాలో అరెస్టు చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top