కొంప ముంచిన అత్యాశ.. రూ.2 కోట్లతో ఉడాయించిన వ్యాపారి | Pearl Trader Two Crore Scam In Hanamkonda | Sakshi
Sakshi News home page

కొంప ముంచిన అత్యాశ.. రూ.2 కోట్లతో ఉడాయించిన వ్యాపారి

Jul 1 2021 2:26 AM | Updated on Jul 1 2021 2:26 AM

Pearl Trader Two Crore Scam In Hanamkonda - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హన్మకొండ చౌరస్తా: ఇంటి వద్దే కూర్చొని నెలకు రూ.20 వేల వరకు సంపాదించండి అంటూ వచ్చిన ప్రకటన పలువురిలో ఆశలు రేకెత్తించింది. చివరకు ఆ అత్యాశే కొంపముంచింది. ఏకంగా రూ.2 కోట్లు కుచ్చుటోపీ పరారయ్యాడో వ్యాపారి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని ఓ కాంప్లెక్స్‌లో విజయవాడకు చెందిన శ్రీనివాసరావు మార్చిలో ముత్యాల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇంటి వద్దే కూర్చోండి, నెలకు రూ.20 నుంచి రూ.30 వేల వరకు సంపాదించండి అంటూ ప్రకటనలు ఇచ్చాడు.

దండ అల్లేందుకు సరిపడా ముత్యాలు తామే ఇస్తామని, ఆ ముత్యాలతో మాల అల్లుకుని వస్తే రూ.300 చెల్లిస్తానని చెప్పాడు. కానీ తొలుత దండ విలువ ఆధారంగా రూ.2 వేలు పెట్టుబడి పెట్టాలని, అలా ఎన్ని దండలకు సరిపడా డబ్బు చెల్లిస్తే అన్ని ముత్యాలను అందిస్తామని తెలిపారు. దీంతో దాదాపు 165 మంది రూ.రెండు కోట్ల మేరకు వ్యాపారి శ్రీనివాసరావుకు చెల్లించారు. ఇదే అదనుగా భావించిన అతను ఉడాయించాడు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement