తీన్మార్‌ మల్లన్నకు నోటీసులు | Notices to Teenmar Mallanna Alias Naveen | Sakshi
Sakshi News home page

తీన్మార్‌ మల్లన్నకు నోటీసులు

Aug 5 2021 2:21 AM | Updated on Aug 5 2021 2:21 AM

Notices to Teenmar Mallanna Alias Naveen - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యూ ట్యూబ్‌ ఛానల్‌ క్యూ న్యూస్‌ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఆ సంస్థ మాజీ ఉద్యోగిని ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా పరిగణిస్తూ సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్‌ కింద వీటిని ఇచ్చారు. పీర్జాదిగూడలోని సంస్థ కార్యాలయంలో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు మొత్తం 12 హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీక్షల నిమిత్తం రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీకి పంపనున్నారు. ఆ నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఆధారాలను బట్టి న్యాయస్థానానికి నివేదిక అందజేస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement