నవవధువు అనుమానాస్పద మృతి

Newly Married Women Monisha Suicide In Karnataka - Sakshi

కట్నం కోసం భర్తే చంపాడని ఫిర్యాదు

సాక్షి, బెంగళూరు: కరోనా కాలంలో కట్న పిశాచులు చెలరేగుతున్నారు. దొడ్డ తాలూకా దొడ్డబెళవంగల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కసాఘట్ట గ్రామంలో వరకట్న దాహానికి మోనిషా (20) అనే నవ వధువు బలైంది. 6 నెలల క్రితం మోనిషాను కసాఘట్ట గ్రామానికి చెందిన ముత్తేగౌడ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. ఒక్కతే కుమార్తె కావడంతో ఆమె తల్లిదండ్రులు ఘనంగా వివాహం జరిపించి కట్నకానుకలు భారీగా సమర్పించారు.  

కొన్నిరోజులకే మరింత డబ్బు తేవాలని భర్త వేధించసాగాడు. ఈ ఆరునెలల్లో పలుమార్లు డబ్బులు ఇచ్చామని అయితే తాము ఉంటున్న ఇల్లు కూడా రాసి­వ్వాలని ఒత్తిడిచేయడంతో మోనిషా పుట్టిం­టికి వచ్చేసింది. ఇటీవల పెద్దలు రాజీచేసి అత్తవారింటికి పంపారు. మంగళవారం ఉదయం ఫోన్‌చేసిన ముత్తేగౌడ మోనిషాకు ఫిట్స్‌ వచ్చి మరణించిందని చెప్పాడన్నారు. మోనిషాకు ఎప్పుడూ ఫిట్స్‌ రావని, భర్త, కుటుంబ సభ్యులతో కలిసి హత్యచేసి నాటకామాడుతున్నారని యువతి తల్లిదండ్రులు తెలిపారు. వారు ముత్తేగౌడ, తల్లి శారదమ్మ, తండ్రి శివకుమార్, చెల్లెలు సుధలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top