breaking news
monisha
-
రైలుతో... ఆమె చెట్టపట్టాలు
మోనిషా రాజేష్(Monisha Rajesh)... 42 ఏళ్ల ఈ ట్రావెల్ రైటర్‌కు గత 15 సంవత్సరాలుగా రైలే ఇల్లు. 2010లో ఆమె 80 రైళ్లలో దేశమంతా తిరిగి ‘అరౌండ్ ఇండియా ఇన్ 80 ట్రైన్స్’ పుస్తకం రాశారు. ఆ తర్వాత లోకమంతా 80 రైళ్లలో చుట్టేసి ‘అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 ట్రైన్స్’ రాసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు స్త్రీలు రాత్రిపూట చేసే రైలు ప్రయాణాలు ఎలా ఉంటాయో ప్రపంచమంతా తిరిగి ‘మూన్లైట్ ఎక్స్‌ప్రెస్’ వెలువరించారు. ఈ రైలు ప్రయాణాల ప్రేమికురాలి పరిచయం...‘భారతదేశాన్ని చూడాలంటే రైలులోనే చూడాలి’ అంటారు మోనిషా రాజేష్. యు.కె.లో స్థిరపడ్డ ఈ మాజీ జర్నలిస్టు ఇప్పుడు పూర్తిగా ‘ట్రావెల్ రైటర్’గా మారారు. ఆశ్చర్యకరంగా ఆమె తన కెరీర్‌కు ‘రైలు’ను ఒక ఆధారంగా మలుచుకున్నారు. అంటే పుస్తకాలు అమ్ముడవగా వచ్చే డబ్బు ఆమెకు రైలు ద్వారా వస్తున్నట్టే. ‘హఠాత్తుగా నాకు ఏమర్థమైందంటే నా పుస్తకాలకు రైలు కంటే మించిన కథానాయకుడు లేడని’ అంటారామె నవ్వుతూ.ఆమె తాజా పుస్తకం ‘మూన్లైట్ ఎక్స్‌ప్రెస్ – అరౌండ్ ద వరల్డ్ బై నైట్ ట్రైన్’ మార్కెట్లోకి వచ్చింది. ప్రపంచంలోని అనేక దేశాలలో రాత్రి జర్నీల ద్వారా ట్రైన్లలో సంచారం చేస్తూ తాను చూసిన ప్రపంచాన్ని పరిచయం చేశారు మోనిషా. ఇప్పటివరకూ ‘రైలు’ ప్రయాణాల ఆధారంగా ఆమెవి నాలుగు పుస్తకాలు వచ్చాయి.మొదటిసారి రైలుతో ప్రేమమోనిషా తల్లిదండ్రులది చెన్నై. ఇద్దరూ డాక్టర్లు. అయితే యు.కెలోని నార్ఫోక్లో స్థిరపడ్డారు. మోనిషా అక్కడే పుట్టి పెరిగింది. ఆమెకు 9 ఏళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు రెండేళ్లపాటు వెనక్కు వచ్చి చెన్నైలో ఉన్నారు కాని ఆ సమయంలో మోనిషాకు దేశం గురించి తెలుసుకునే అవకాశం రాలేదు. తర్వాత ఆమె చదువు సాగి, జర్నలిస్టుగా మారాక, 2010 లో మరోసారి ఇండియాకు వచ్చారు. ‘నా దేశాన్ని చూడాలి అని నేను అనుకున్నప్పుడు విమాన ప్రయాణం బడాయి వద్దనుకున్నాను. రోడ్డు సేఫ్ కాదు. అందుకే రైలు ప్రయాణం ఎంచుకున్నాను.90 రోజుల పాస్ తీసుకుని రైళ్లలో తిరగడం మొదలైన రెండు నెలల్లోనే నాకు అర్థమై పోయింది భారతదేశంలో రైలు ప్రయాణం అద్భుతమని. అందుకే ఈసారి ఒక ప్లాన్‌తో వచ్చి 80 ట్రైన్లలో తిరిగి ‘అరౌండ్ ఇండియా ఇన్ 80 ట్రైన్స్’ పుస్తకం రాశాను. దానికి బోల్డంత పాఠకాదరణ, అవార్డులు లభించాయి. ఆ ఉత్సాహం నన్ను రైలులో ప్రపంచ యాత్ర చేసేలా చేసింది’ అని తెలిపారు మోనిషా. ఆమె ఇండియాలో తిరుగుతూ కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు.. మోనిషా రైలు మార్గం ఉన్న ప్రతి దేశంలో తిరుగుతూ ‘అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 ట్రైన్స్’ పుస్తకం రాశారు. ఇప్పుడు రాత్రి ప్రయాణాలు ఉన్న రైళ్లలో ప్రయాణించి ‘మూన్లైట్ ఎక్స్‌ప్రెస్’ పుస్తకం రాశారు.ధన్యమయ్యే ప్రయాణం‘నేను భారతదేశమంతా సెకండ్ క్లాస్ ట్రైన్లో తిరిగాను. భారతదేశం అర్థం కావాలంటే ట్రైను ప్రయాణం చేయాలి. అదీగాక మనుషులు విమాన ప్రయాణాలతో విసుగెత్తారు. కోవిడ్ వల్ల లాక్డౌన్ వచ్చి ముగిశాక ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు భ్రమణకాంక్ష పెరిగింది. లోకం చూద్దాం అనుకుంటున్నారు. దానికి గొప్ప మార్గం రైలే. యూరప్‌లో 2015 నాటికి రాత్రి ప్రయాణాలు ఉండే స్లీపర్ ట్రైన్లు బంద్ చేశారు. ఇప్పుడిప్పుడే అవి తిరిగి మొదలయ్యాయి. స్త్రీలు ఒంటరిగా రాత్రిళ్లు రైలు ప్రయాణాలు చేయడం, జీవితాన్ని ఆస్వాదించడంలో భాగమే’ అంటారు మోనిషా.ప్రకృతి కన్నులు‘టర్కీ నుంచి ఆర్మేనియా వరకూ 26 గంటల పాటు సాగే రైలు ప్రయాణం అద్భుతం. టర్కీ సౌందర్యం మొత్తం అక్కడ చూడొచ్చు. ఇక అత్యుత్తమ రైలు ప్రయాణమంటే నార్వే దేశానికి వెళ్లాలి. అక్కడ రైలు కంపార్ట్మెంట్లు ఇల్లంత సౌకర్యంగా ఉంటాయి. భోజనం ఏది కావాలంటే అది దొరుకుతుంది. అదొక్కటే కాదు రాత్రి మూడు గంటలకు రైలు అద్దాల్లో నుంచి సూర్యోదయం చూడొచ్చు. ఇలా మరెక్కడ సాధ్యం?’ అంటారు మోనిషా. -
ఓటేసేందుకు అమెరికా నుంచి వచ్చిన స్టార్ హీరో కూతురు
ఏప్రిల్ 26న కర్ణాటకలో రెండో దశ ఎన్నికలు జరిగాయి. సామాన్య ప్రజలతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా ప్రజలు తమ గ్రామాలకు చేరుకుని ఓటు వేశారు. ఈ కోవలో కన్నడ టాప్ హీరో దునియా విజయ్ కూతురు మోనిషా కూడా ఉన్నారు.ఇదిలా ఉంటే దునియా విజయ్ కూతురు మోనిషా అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదువుతుంది. ఏప్రిల్ 26న ఎన్నికలు ఉండటంతో తన ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు ఆమెరికా నుంచి బెంగళూరుకు చేరుకుంది. తండ్రి మాదిరి మోనిషా కూడా సినిమా రంగంలో రాణించాలని కోరుకుంటుంది. ఈ విషయంపై ఆమె ఇలా చెప్పింది. 'నేనూ, మా చెల్లి మోనికా ఇద్దరమూ సినిమా రంగంపై ఆసక్తి చూపుతున్నాం. నాన్నకు మొదట నచ్చలేదు. సినిమాల్లోకి వద్దని ఆయన చెప్పారు. కానీ, నా సీరియస్‌నెస్ చూసి ఒప్పుకున్నారు.సినిమా ఇండస్ట్రీకి వస్తే సరైన శిక్షణ తీసుకోవాలని నాన్న గారు సూచించారు. నటనతో పాటు సినిమాల్లోని వివిధ దశలు, సాంకేతికత, మీడియాను ఎలా ఎదుర్కోవాలి, నన్ను నేను ఎలా రక్షించుకోవాలి.. ఇలా అన్నీ సరిగ్గా నేర్చుకుని రావాలని నాన్న సూచించారు. దీంతో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నన్ను చేర్పించారు. ప్రస్తుతం అక్కడే చదువుకుంటున్నాను. కోర్సు పూర్తయ్యాక శాండల్ వుడ్‌కి తప్పకుండా వస్తాను.' అని చెప్పింది మోనిషా.బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు దునియా విజయ్. కన్నడలో ఎన్నో సినిమాలు చేసిన ఆయనకు తెలుగులో ఇదే మొదటి చిత్రం. ప్రస్తుతం ఆయన గోపీచంద్ చిత్రంలో నటిస్తున్నాడు. -
పెళ్లంటే ఇంట్రస్ట్ లేదు, సహజీవనం చేస్తా: హీరోయిన్
మోడలింగ్‌తో కెరీర్ మొదలుపెట్టింది మోనిశ మోహన్ మీనన్. ఈ ఏడాది రిలీజైన ఫైట్ క్లబ్ మూవీలో హీరోయిన్గా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. అయితే ఆమెకు డైరెక్షన్ అంటే ఇష్టమట. అందుకే సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఇంట్లో అందరూ తన ఇష్టాన్ని వ్యతిరేకించినా లెక్క చేయలేదు. తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అక్కడి నుంచి పారిపోయి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.. కో డైరెక్టర్‌గా న్యూ నార్మల్ అనే షార్ట్ ఫిలిం తెరకెక్కించింది. ఈ లఘు చిత్రం మంచి ఆదరణ పొందడంతోపాటు ఆమెకు బోలెడన్ని అవకాశాలను తెచ్చిపెట్టాయి. అయితే దర్శకురాలిగా కాకుండా హీరోయిన్గా ఛాన్సులు అందుకుంది మోనిశ. వాళ్ల సినిమాలు చూసే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మోనిశ మాట్లాడుతూ.. 'అంజలి మీనన్, జోయా అక్తర్ వంటి దర్శకురాళ్ల సినిమాలు చూశాక నాకూ డైరెక్టర్ అవ్వాలనిపించింది. ఇదే విషయం ఇంట్లో చెప్తే నాన్న ఒప్పుకోలేదు. ఇంజనీరింగ్ చదివితే సరిపోతుంది.. సినిమాలు గట్రా ఏమీ వద్దన్నాడు. కానీ నా మనసు మాత్రం అటే లాగేది. ఇంజనీరింగ్ అయ్యాక ఇన్ఫోటెక్లో పని చేశాను. అప్పుడు కూడా సినిమా వైపు వెళ్తానంటే ఇంట్లో అంతా తిరస్కరించారు. వీళ్లు ఒప్పుకునేలా లేరని 2016లో ఇల్లు వదిలి బయటకు వచ్చాను. రీసెర్చ్ టీమ్‌లో అడుగుపెట్టా.. ఆ తర్వాత దర్శకుడు రోషన్ 'కాయంకులం కొచున్ని' సినిమా కోసం ఒక రీసెర్చ్ టీమ్ కావాలని పేపర్లో యాడ్ ఇచ్చాడు. ఈ అధ్యయనాల గురించి నాకు పెద్దగా అవగాహన లేకపోయినా ఎలాగోలా సినిమాల్లో దూరిపోవాలని ప్రయత్నించాను, సక్సెస్ అయ్యాను. రీసెర్చ్ టీమ్‌లో బాగా పని చేసినవారికి అసిస్టెంట్‌గా ఛాన్స్ ఇస్తానన్నాడు. అలా ముప్పుతిప్పలు పడి ఆయన చెప్పింది అధ్యాయం చేసి మంచి మార్కులు కొట్టేశాను. పెళ్లిపై ఆసక్తి లేదు తర్వాత ఆయన తెరకెక్కించిన నాలుగు సినిమాలకు తన దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎన్నాళ్లని చేస్తాను.. ఎప్పటికైనా దర్శకురాలిని అవ్వాలన్నదే నా కల. అలా న్యూ నార్మల్ అనే షార్ట్ ఫిలిం తీశాను. చాలా సంతృప్తిగా అనిపించింది. పెళ్లి విషయానికి వస్తే.. నాకలాంటి ఆలోచనే లేదు. పెళ్లికి బదులుగా సహజీవనం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు రెండు నెలలు కాగానే బ్రేకప్ చెప్పుకుని మరొకరిని ప్రేమిస్తున్నారు. ఈ మాత్రందానికి పెళ్లెందుకు?' అంటోంది మోనిశ. చదవండి: అల్లు అర్జున్ ఇంటి భవన నిర్మాణానికి పని చేశా.. పెద్ద దెబ్బ తగిలి రక్తం.. -
నవవధువు అనుమానాస్పద మృతి
సాక్షి, బెంగళూరు: కరోనా కాలంలో కట్న పిశాచులు చెలరేగుతున్నారు. దొడ్డ తాలూకా దొడ్డబెళవంగల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కసాఘట్ట గ్రామంలో వరకట్న దాహానికి మోనిషా (20) అనే నవ వధువు బలైంది. 6 నెలల క్రితం మోనిషాను కసాఘట్ట గ్రామానికి చెందిన ముత్తేగౌడ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. ఒక్కతే కుమార్తె కావడంతో ఆమె తల్లిదండ్రులు ఘనంగా వివాహం జరిపించి కట్నకానుకలు భారీగా సమర్పించారు. కొన్నిరోజులకే మరింత డబ్బు తేవాలని భర్త వేధించసాగాడు. ఈ ఆరునెలల్లో పలుమార్లు డబ్బులు ఇచ్చామని అయితే తాము ఉంటున్న ఇల్లు కూడా రాసివ్వాలని ఒత్తిడిచేయడంతో మోనిషా పుట్టింటికి వచ్చేసింది. ఇటీవల పెద్దలు రాజీచేసి అత్తవారింటికి పంపారు. మంగళవారం ఉదయం ఫోన్‌చేసిన ముత్తేగౌడ మోనిషాకు ఫిట్స్ వచ్చి మరణించిందని చెప్పాడన్నారు. మోనిషాకు ఎప్పుడూ ఫిట్స్ రావని, భర్త, కుటుంబ సభ్యులతో కలిసి హత్యచేసి నాటకామాడుతున్నారని యువతి తల్లిదండ్రులు తెలిపారు. వారు ముత్తేగౌడ, తల్లి శారదమ్మ, తండ్రి శివకుమార్, చెల్లెలు సుధలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బాలిక అనుమానాస్పద మృతి
అనంతపురం, లేపాక్షి: శిరివరం గ్రామానికి చెందిన మోనిష (16) బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక తండ్రి కుమార్ తెలిపిన మేరకు... కర్ణాటకలోని హోసూరు ప్రాంతం జూజూవాడకు చెందిన కుమార్‌కు లేపాక్షి మండలం శిరివరం గ్రామానికి చెందిన రాధతో వివాహమైంది. 2003లో భర్తతో గొడవపడి రాధ తన పుట్టినిల్లు అయిన శిరివరం గ్రామానికి వచ్చేసింది. కుమార్తె మోనిష తండ్రి వద్ద ఉంటూ అత్తిబేలే వద్దవున్న శ్రీవెంకటేశ్వర స్కూలులో చదువుతోంది. 2017 జూన్‌లో పాఠశాలకు వెళ్లిన మోనిష కనిపించకుండా పోయింది. తండ్రి హోసూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అమ్మాయి శిరివరంలోని తన తల్లి వద్ద ఉంటోందని పోలీసుల విచారణలో తేలింది. దీంతో కుమార్ లేపాక్షి పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ చేసి.. కుమార్తెను తల్లి వద్దే వదిలి వెళ్లిపోయాడు. ప్రస్తుతం మోనిష గౌరిబిదనూరులోని పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మంగళవారం రాత్రి 2.45 గంటలకు కుమార్తె చనిపోయిందని సమాచారం అందడంతో కుమార్ హుటాహుటిన శిరివరం చేరుకున్నాడు. పాఠశాల నుంచి ఆలస్యంగా వస్తోందని మందలించినందుకు మనస్తాపం చెంది సంపులో పడి ఆత్మహత్య చేసుకుందని తల్లి చెబుతోంది. కుమార్తె మృతిపై అనుమానం ఉండటంతో భార్య రాధ, బంధువులు లలిత, వెంకటేష్, క్రిష్టప్పలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఎస్ఐ ఆంజనేయులు కేసు నమోదు చేశారు. -
అమ్మను వెదికేందుకని...
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్ : ఈ చిన్నారుల పేర్లు జాస్మిన్(8), మోనిష(6). గజపతినగరంలో తప్పిపోయి తిరుగుతున్న వీరిని పోలీసుల సమాచారంతో చైల్డ్‌లైన్ సభ్యులు తమ కార్యాలయానికి తీసుకొచ్చారు. తమ అమ్మ కనిపించడం లేదని, ఆమె కోసం వెదుకుతూ వెళ్లామని ఈ చిన్నారులు చెబుతున్నారు. తమది పట్టణంలోని ఖాదర్నగర్ అని తెలిపారు. అంతకుమించి వివరాలు చెప్పలేకపోతున్నారు. గజపతినగరం వైపు వెళ్లి.. అక్కడ నుంచి ఎటువెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటున్న వారి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యులకు సమాచారమిచ్చారు. చైల్డ్‌లైన్ సభ్యులు గజపతినగరం చేరుకుని బాలికలిద్దరినీ విజయనగరంలోని కార్యాలయానికి తీసుకొచ్చి, భోజనం పెట్టారు. ఈ చిన్నారుల తరఫు వారు ఎవరైనా వస్తే అప్పగిస్తామని సంస్థ సభ్యులు తెలిపారు.