పెళ్లంటే ఇంట్రస్ట్‌ లేదు, సహజీవనం చేస్తా: హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

Monisha Mohan Menon: ఇంటి నుంచి పారిపోయిన హీరోయిన్‌.. పెళ్లి వద్దు, సహజీవనమే ముద్దంటున్న బ్యూటీ

Published Fri, Dec 29 2023 12:45 PM

Monisha Mohan Menon Says She Not Interested in Marriage - Sakshi

మోడలింగ్‌తో కెరీర్‌ మొదలుపెట్టింది మోనిశ మోహన్‌ మీనన్‌. ఈ ఏడాది రిలీజైన ఫైట్‌ క్లబ్‌ మూవీలో హీరోయిన్‌గా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. అయితే ఆమెకు డైరెక్షన్‌ అంటే ఇష్టమట. అందుకే సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఇంట్లో అందరూ తన ఇష్టాన్ని వ్యతిరేకించినా లెక్క చేయలేదు. తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అక్కడి నుంచి పారిపోయి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.. కో డైరెక్టర్‌గా న్యూ నార్మల్‌ అనే షార్ట్‌ ఫిలిం తెరకెక్కించింది. ఈ లఘు చిత్రం మంచి ఆదరణ పొందడంతోపాటు ఆమెకు బోలెడన్ని అవకాశాలను తెచ్చిపెట్టాయి. అయితే దర్శకురాలిగా కాకుండా హీరోయిన్‌గా ఛాన్సులు అందుకుంది మోనిశ.

వాళ్ల సినిమాలు చూసే..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మోనిశ మాట్లాడుతూ.. 'అంజలి మీనన్‌, జోయా అక్తర్‌ వంటి దర్శకురాళ్ల సినిమాలు చూశాక నాకూ డైరెక్టర్‌ అవ్వాలనిపించింది. ఇదే విషయం ఇంట్లో చెప్తే నాన్న ఒప్పుకోలేదు. ఇంజనీరింగ్‌ చదివితే సరిపోతుంది.. సినిమాలు గట్రా ఏమీ వద్దన్నాడు. కానీ నా మనసు మాత్రం అటే లాగేది. ఇంజనీరింగ్‌ అయ్యాక ఇన్ఫోటెక్‌లో పని చేశాను. అప్పుడు కూడా సినిమా వైపు వెళ్తానంటే ఇంట్లో అంతా తిరస్కరించారు. వీళ్లు ఒప్పుకునేలా లేరని 2016లో ఇల్లు వదిలి బయటకు వచ్చాను.

రీసెర్చ్‌ టీమ్‌లో అడుగుపెట్టా..
ఆ తర్వాత దర్శకుడు రోషన్‌ 'కాయంకులం కొచున్ని' సినిమా కోసం ఒక రీసెర్చ్‌ టీమ్‌ కావాలని పేపర్‌లో యాడ్‌ ఇచ్చాడు. ఈ అధ్యయనాల గురించి నాకు పెద్దగా అవగాహన లేకపోయినా ఎలాగోలా సినిమాల్లో దూరిపోవాలని ప్రయత్నించాను, సక్సెస్‌ అయ్యాను. రీసెర్చ్‌ టీమ్‌లో బాగా పని చేసినవారికి అసిస్టెంట్‌గా ఛాన్స్‌ ఇస్తానన్నాడు. అలా ముప్పుతిప్పలు పడి ఆయన చెప్పింది అధ్యాయం చేసి మంచి మార్కులు కొట్టేశాను.

పెళ్లిపై ఆసక్తి లేదు
తర్వాత ఆయన తెరకెక్కించిన నాలుగు సినిమాలకు తన దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాను. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎన్నాళ్లని చేస్తాను.. ఎప్పటికైనా దర్శకురాలిని అవ్వాలన్నదే నా కల. అలా న్యూ నార్మల్‌ అనే షార్ట్‌ ఫిలిం తీశాను. చాలా సంతృప్తిగా అనిపించింది. పెళ్లి విషయానికి వస్తే.. నాకలాంటి ఆలోచనే లేదు. పెళ్లికి బదులుగా సహజీవనం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు రెండు నెలలు కాగానే బ్రేకప్‌ చెప్పుకుని మరొకరిని ప్రేమిస్తున్నారు. ఈ మాత్రందానికి పెళ్లెందుకు?' అంటోంది మోనిశ.

చదవండి: అల్లు అర్జున్‌ ఇంటి భవన నిర్మాణానికి పని చేశా.. పెద్ద దెబ్బ తగిలి రక్తం..

 
Advertisement
 
Advertisement