కన్నతండ్రే కామాంధుడై..! | Nalgonda: 13 Year Old Girl Gets Pregnant, Molested For 3 Months | Sakshi
Sakshi News home page

మూడు నెలలుగా కూతురుపై లైంగికదాడి

Mar 29 2021 4:34 AM | Updated on Mar 29 2021 10:03 AM

Nalgonda: 13 Year Old Girl Gets Pregnant, Molested For 3 Months - Sakshi

సాక్షి, చింతపల్లి: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి కామాంధుడిగా మారాడు. మూడు నెలలుగా కూతురుపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాల గ్రా మానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను డిండిలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదివిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూసివేయడంతో ఆ బాలిక ఇంటివద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే బాలికను బలవంతంగా లోబర్చుకున్నాడు. విషయం బయటికి చెప్పొద్దంటూ బెదిరింపులకు పాల్పడుతూ లైంగికదాడికి ఒడిగడుతున్నాడు.

ఇటీవల బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఏమీ ఎరుగనట్లు భార్యతో కలసి కూతురును దేవరకొండలో ని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్య పరీక్షల్లో బాలిక గర్భం దాల్చినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇంటికి వచ్చిన తర్వాత కూతురిని తల్లి నిలదీయడంతో తండ్రి చేసిన నిర్వాకం చెప్పింది. ఈ విషయం  ఎవరికీ చెప్పొద్దని తల్లీకూతుళ్లను శనివారం రాత్రి ఇంట్లోనే బంధించి చితకబాదాడు. తట్టుకోలేకపోయిన ఆ బాలిక పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చింతపల్లి ఎస్‌ఐ తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement