మిస్టరీగా ఇంటర్‌ విద్యార్ధిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి

Mystery Continuous In Inter Student Bhavya Sri Death Penamuru - Sakshi

సాక్షి, చిత్తూరు జిల్లా:  ఇంటర్‌ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీగా మారింది. న్యాయం కోసం పెనమూరు పీఎస్‌ ఎదుట బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం ఆందోళన  చేపట్టారు. 

కాగా వేణుగోపాలపురానికి చెందిన భవ్యశ్రీ ఈ నెల 17న అదృశ్యమైంది. 18వ తేదీన విద్యార్ధిని తండ్రి మునికృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. 20న ఎగువ చెరువు వద్ద బావిలో భవ్యశ్రీ శవమై కనిపించింది. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

కాగా పోస్టుమార్టంలో ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమికంగా తెలిసిందని ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తెలిపారు. అఘాయిత్యం జరిగిందా, విషప్రయోగం జరిగిందా అని పరీక్షించేందుకు సాంపిల్స్‌ తీసుకున్నట్లు పేర్కొన్నారు. నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయిందా? ఎక్కడి నుంచి అయినా తెచ్చి ఆమె మృతదేహాన్ని బావిలో పడేశారా అన్న విషయం తేల్చేందుకు స్టెరమ్‌బోన్‌ సాంపిల్స్‌ను కెమికల్‌ అనాలసిస్‌ కోసం తిరుపతి ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపుతున్నట్లు పేర్కొన్నారు.

ఆ నివేదికలు వచ్చిన అనంతరం అనుమా నితులను సమగ్రంగా, నిష్పాక్షికంగా విచారిస్తామన్నారు. విచారణను తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారాలను, నిరాధార వార్తలను ప్రచారంచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
చదవండి: రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌, ఆర్‌ఐ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top